Rana, NagaChaitanya, Nani Movies eyes on July Release

Tuesday,April 27,2021 - 04:01 by Z_CLU

మే నుండి కరోన సెకండ్ వేవ్ తీవ్రత ఇంకా ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు నిపుణులు. దీంతో జూన్ నెలలో కూడా సినిమాలు రిలీజ్ అయ్యే అవకాశం కనిపించడం లేదు. ఎటొచ్చి జులై నుండి కరోన ప్రభావం తగ్గుతుందని భావిస్తూ అదే నెలలో తమ సినిమాల రిలీజ్ లు ప్లాన్ చేసుకుంటున్నారు నిర్మాతలు. నాని టక్ జగదీశ్, నాగ చైతన్య లవ్ స్టోరి, రానా విరాటపర్వం సినిమాలు జులై లో థియేటర్స్ కి వచ్చే ఛాన్స్ ఉంది.

  • love story nagachaitanya sai pallavi

నిజానికి అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ పాటికి ఈ మూడు సినిమాలు థియేటర్స్ లో ఉండాలి. ఏప్రిల్ లో నాగచైతన్య 'లవ్ స్టోరి' తో పాటు నాని 'టక్ జగదీశ్' వారం గ్యాప్ లో రిలీజ్ అవ్వాల్సి ఉంది. ఇక ఏప్రిల్ ఎండింగ్ లో రానా విరాటపర్వం రిలీజ్ అంటూ ప్రకటించారు. కానీ సెకండ్ వేవ్ లో కరోన వ్యాప్తి ఎక్కువగా ఉండటం, థియేటర్స్ మూసేయడం కారణంగా వెనక్కి వెళ్ళాయి. అయితే ఫస్ట్ కాపీతో రెడీ గా ఉన్న ఈ సినిమాలకు జులై ఒక్కటే బెస్ట్ ఆప్షన్. ఆపై అన్ని పెద్ద సినిమాలు ఉన్నాయి.

మెగాస్టార్ ఆచార్య , అల్లు అర్జున్ పుష్ప సినిమాలు ఆగస్ట్ లో రిలీజ్ సిద్దమవుతున్నాయి. ఈ లోపు పోస్ట్ పోన్ అయిన మరో రెండు పెద్ద సినిమాలు కూడా ఆగస్ట్ లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. బాలయ్య 'అఖండ' ఆగస్ట్ లోనే రిలీజ్ అంటున్నారు.

  • Virata Parvam rana sai pallavi

ఇక వెంకటేష్ నటించిన 'నారప్ప' లేదా 'దృశ్యం 2' ఆగస్ట్ లో థియేటర్స్ లోకి వచ్చే ఛాన్స్ ఉంది. ఇక సెప్టెంబర్ , అక్టోబర్ లో కూడా ఇదే పరిస్థితి. అందుకే చైతూ, నాని, రానా సినిమాలు జులై లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. వీటితో పాటు అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా కూడా జూన్ నుండి జులై కి వెళ్ళే ఛాన్స్ ఉంది. సో జులై లో మినిమమ్ రేంజ్ హీరోల సినిమాలు థియేటర్స్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాయి. మరి వీటిలో సెకండ్ వేవ్ తర్వాత ఎక్కువ శాతం కలెక్షన్స్ రాబట్టే సినిమా ఏదో తెలుసుకోవాలంటే ఇంకో రెండు నెలలు వెయిట్ చేయాలి.

  • - Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics