Rana first look from ViraataParvam

Monday,December 14,2020 - 11:17 by Z_CLU

చాన్నాళ్లుగా ఫిలింసర్కిల్స్ లో నలుగుతున్న ప్రాజెక్టు విరాటపర్వం. ఇప్పుడీ సినిమాకు సంబంధించి అసలైన సందడి మొదలైంది. మూవీ నుంచి రానా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు.

ఈరోజు రానా పుట్టినరోజు. ఈ సందర్భంగా ViraataParvam నుంచి Rana ఫస్ట్ లుక్ రిలీజైంది. చేతిలో గన్ పట్టుకొని, ఎగ్రెసివ్ గా కనిపిస్తున్న రానా లుక్ అందర్నీ ఫస్ట్ లుక్ లోనే ఎట్రాక్ట్ చేస్తోంది. ఈ సినిమాలో రానా నక్సలైట్ రవన్న గా కనిపించబోతున్నాడు.

Virata_parvam_rana_first_look

విరాటపర్వం సినిమాకు సంబంధించి ఇప్పటికే సాయిపల్లవి, ప్రియమణి లాంటి తారల ఫస్ట్ లుక్స్ వచ్చేశాయి. రానా ఫస్ట్ లుక్ కోసం ఇన్నాళ్లు వెయిట్ చేయాల్సి వచ్చింది. అంతేకాదు.. ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన కొద్ది సేపటికే ఫస్ట్ గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు. దీంతో సినిమాపై బజ్ మరింత పెరిగింది.

https://www.youtube.com/watch?v=h61WbdVGJIs&feature=emb_logo

వేణు ఊడుగుల డైరక్ట్ చేస్తున్న ఈ సినిమాను SLV Cinemas బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నాడు. సురేష్ బాబు ప్రజెంటర్ గా వ్యవహరిస్తున్నారు. సురేష్ బొబ్బిని సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో నివేత పెతురాజ్, ప్రియమణి, నందితదాస్, నవీన్ చంద్ర, ఈశ్వరీరావు కీలక పాత్రలు పోషిస్తున్నారు.