Ram’s RED movie to release in 7 Languages

Friday,January 08,2021 - 12:36 by Z_CLU

బ్లాక్ బస్టర్ హిట్ ‘ఇస్మార్ట్ శంకర్’ తర్వాత రామ్ హీరోగా నటించిన ‘రెడ్’ చిత్రం ఈ నెల14 న సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. మాళవికా శర్మ, నివేదా పేతురాజ్, అమృతాఅయ్యర్ ఇందులో కథానాయికలు. తిరుమల కిషోర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్పతాకంఫై ‘స్రవంతి’ రవి కిషోర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. కెరీర్ లో రామ్ డ్యూయల్ రోల్ చేసిన ఫస్ట్ మూవీ ఇది.

ఈ చిత్రాన్ని ఏడు భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు. కన్నడం, మలయాళం, బెంగాలీ, భోజ్ పురి, మరాఠీ, తమిళంతో పాటు హిందీ లోకి కూడా డబ్ చేశారు. కన్నడ వెర్షన్ ఈ నెల14 నే విడుదల కానుంది. మిగిలిన వెర్షన్ లను ఈ నెలాఖరున రిలీజ్ చేస్తారు. తమిళ వెర్షన్ ని మాత్రం డైరెక్ట్ గా ఓటిటి లో విడుదల చేస్తున్నారు.

రామ్ కి ఇతర భాషల్లో పెరిగిన మార్కెట్ రీత్యా రెడ్ సినిమాను ఇలా డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. మూవీకి సంబంధించి ఇప్పటికే రిలీజైన థియేట్రికల్ ట్రయిలర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది.