Ramcharan tested positive for Corona
Tuesday,December 29,2020 - 09:28 by Z_CLU
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కు కరోనా సోకింది. ప్రస్తుతం అతడు హోం క్వారంటైన్ లో ఉన్నాడు. తనకు కరోనా సోకిన విషయాన్ని చెర్రీ స్వయంగా బయటపెట్టాడు.
ప్రస్తుతం RRR సినిమా చేస్తున్నాడు చరణ్. ఎన్టీఆర్ తో కలిసి నటిస్తున్నాడు. దీంతో పాటు త్వరలోనే ఆచార్య సెట్స్ పై కూడా జాయిన్ అవ్వబోతున్నాడు. రీసెంట్ గా ఆచార్య సెట్స్ లోకి వెళ్లి అందర్నీ పలకరించాడు కూడా. అంతలోనే ఇలా కరోనా బారిన పడ్డాడు చరణ్.
కొన్ని రోజుల కిందట చిరంజీవి కూడా తనకు కరోనా సోకినట్టు ప్రకటించారు. కాకపోతే ఆ తర్వాత కొన్ని రోజులకే తప్పుడు కిట్ కారణంగా తనకు కరోనా వచ్చినట్టు చూపించిందని, తనకు వైరస్ సోకలేదని ప్రకటించారు. ఇప్పుడు చరణ్ కు కరోనా సోకిన విషయం కూడా రాంగ్ రిజల్ట్ అవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు.
కరోనా పాజిటివ్ రావడంతో చరణ్, 2 వారాల వరకు అన్ని కార్యక్రమాలకు దూరంగా ఉండబోతున్నాడు. అతడికి ఎలాంటి లక్షణాలు లేవుకాబట్టి, హోం క్వారంటైన్ లో ఉంటే సరిపోతుంది.