Ramcharan Shankar Movie Shooting Updates
Monday,November 22,2021 - 04:42 by Z_CLU
శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ చేస్తున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ప్రస్తుతం ఈ సినిమా సెకెండ్ షెడ్యూల్ నడుస్తోంది. హైదరాబాద్ లోనే సినిమా షూటింగ్ జరుపుతున్నారు. సెకెండ్ షెడ్యూల్ లో భాగంగా ఇప్పటికే రామ్ చరణ్, కియరా అద్వానీపై ఓ సాంగ్ పిక్చరైజ్ చేశారు. ఇదే షెడ్యూల్ లో చరణ్ పై ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ తీస్తున్నారు.
ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ను పూణెలో ప్లాన్ చేశారు. పూనె, సతారా, పల్టాన్ ప్రాంతాల్లో స్పెషల్ సీక్వెన్స్‌లను ఈ షెడ్యూల్లో చిత్రీకరించారు. శంకర్ అనగానే భారీతనం ఉన్న సినిమాలే గుర్తుకు వస్తాయి. వాటికి ధీటుగా స్టైలిష్‌గా సన్నివేశాలను చిత్రీకరించారు. గ్రాండ్‌గా చిత్రీకరించిన సన్నివేశాలు సినిమాలో వన్ ఆఫ్ ది హైలైట్ అంశాలుగా నిలుస్తాయి. సినిమా కాస్ట్ అండ్ క్రూను డైరెక్టర్ శంకర్ ముందుకు నడిపిన విధానం, ఔట్‌పుట్‌పై మేకర్స్ హ్యపీగా ఉన్నారు
అలా ఫస్ట్ షెడ్యూల్ లో కొన్ని కీలక సన్నివేశాలు తీసిన తర్వాత, ఏమాత్రం ఆలస్యం చేయకుండా సెకెండ్ షెడ్యూల్ మొదలుపెట్టారు. ఇది భారీ షెడ్యూల్ అని తెలుస్తోంది. శంకర్ ఈ సినిమాను శరవేగంగా పూర్తిచేస్తున్నాడు. ఈ సినిమాలో చరణ్ ను సరికొత్తగా చూపించబోతున్నాడు శంకర్.
చరణ్ కెరీర్ లో 15వ చిత్రంగా వస్తోంది శంకర్ మూవీ. ఈ ప్రాజెక్టుకు ఇంకా పేరు పెట్టలేదు. సినిమాలో మరో కీలక పాత్ర కూడా ఉంది. దానికి ఓ స్టార్ యాక్టర్ కావాలి. ఆ పాత్రను ఎవరు పోషిస్తారనేది సస్పెన్స్ ఇంకా నడుస్తోంది.
దిల్ రాజు నిర్మాతగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సునీల్, అంజలి, నవీన్ చంద్ర, శ్రీకాంత్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.
- - Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics