Ramcharan look as SitaRamaRaju from RRR revealed

Saturday,March 27,2021 - 01:18 by Z_CLU

ఈ రోజు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా RRR Movie నుంచి చరణ్ లుక్ ను రిలీజ్ చేశారు. కండలు తిరిగిన దేహంతో తీక్షణంగా చూస్తూ విల్లు ఎక్కుపెట్టిన రామ్ చరణ్ లుక్ ను రాజమౌళి రిలీజ్ చేశాడు.

అల్లూరి సీతారామరాజు లుక్ లో చరణ్ అదిరిపోయాడు. నిజానికి అల్లూరి లుక్ ను ప్రేక్షకులు చూడడం ఇదే ఫస్ట్ టైమ్ కాదు. గతేడాది చరణ్ పుట్టినరోజుకు టీజర్ రిలీజైంది. ఈసారి పుట్టినరోజుకు మరో ఎగ్రెసివ్ లుక్ వచ్చింది. మొత్తమ్మీద ఆర్ఆర్ఆర్ సెట్స్ లోనే చరణ్ 2 బర్త్ డేలు సెలబ్రేట్ చేసుకున్నట్టయింది.

ramcharan sitaramaraju RRR 2

ఇక మూవీ అప్ డేట్స్ విషయానికొస్తే.. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఫైనల్ స్టేజ్ లో ఉంది. మరోవైపు గ్రాఫిక్ వర్క్ జోరుగా నడుస్తోంది. ఇంకోవైపు ప్రీ-రిలీజ్ బిజినెస్ కూడా మొదలైంది.

NTR-Ramcharan హీరోలుగా నటిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నాడు. అక్టోబర్ 13న థియేటర్లలోకి రాబోతోంది ఆర్ఆర్ఆర్.