Ramcharan in Sujeeth Direction

Tuesday,August 03,2021 - 03:26 by Z_CLU

ప్రస్తుతం ఎన్టీఆర్ తో కలిసి రాజమౌళి డైరెక్షన్ లో 'RRR' సినిమాతో పాటు మెగాస్టార్ చిరంజీవి కలిసి 'ఆచార్య' సినిమాలో నటిస్తున్న రామ్ చరణ్ నెక్స్ట్ మరో భారీ ప్రాజెక్ట్ సెట్ చేసుకున్న సంగతి తెలిసిందే. శంకర్ తో తన #RC15 సినిమా చేయబోతున్న చరణ్ తాజాగా మరో ప్రాజెక్ట్ కూడా రెడీ చేసుకుంటున్నాడు. అవును సుజీత్ డైరెక్షన్ లో రామ్ చరణ్ ఓ సినిమా చేయనున్నాడు.

శంకర్ సినిమా తర్వాత #RC16 గా ఆ సినిమా తెరకెక్కనుంది. ఇటివలే చరణ్ కోసం స్క్రిప్ట్ రెడీ చేసి ప్రాజెక్ట్ లాక్ చేసుకున్నాడు సుజీత్. ఈ యంగ్ డైరెక్టర్ చెప్పిన స్క్రిప్ట్ నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట చెర్రీ. ప్రెజెంట్ సుజీత్ చరణ్ సినిమా కోసం ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలు పెట్టి వర్క్ చేస్తున్నాడని తెలుస్తుంది. త్వరలోనే ఈ కాంబో సినిమాను ఎనౌన్స్ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది.

Director Sujeeth

చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న లూసిఫర్ రీమేక్ సినిమాకు ముందుగా సుజీత్ ని అనుకున్న విషయం తెలిసిందే. సుజీత్ ఆ ప్రాజెక్ట్ పై వర్క్ చేస్తున్నాడని స్వయంగా మెగా స్టార్ ఓ సందర్భంలో చెప్పారు కూడా. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల సుజీత్ కాకుండా మోహన రాజా చేతిలో ఆ మెగా రీమేక్ ని పెట్టారు. ఆ టైంలోనే చరణ్ సుజీత్ కి తనతో సినిమా చేస్తానని మాటిచ్చాడని, అందుకే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కించబోతున్నాడని అంటున్నారు. ఈ కాంబో సినిమాను యూ.వీ.క్రియేషన్స్ బేనర్ పై వంశీ, ప్రమోద్ నిర్మించనున్నారని సమాచారం.

  • - Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics