Ramarao On Duty First Week Collection

Monday,August 01,2022 - 03:12 by Z_CLU

రవితేజ హీరోగా నటించిన సినిమా రామారావు ఆన్ డ్యూటీ. శరత్ మండవను దర్శకుడిగా పరిచయం చేస్తూ మాస్ రాజా నటించిన ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ పూర్తి చేసుకుంది. విడుదలైన ఈ 3 రోజుల్లో సినిమాకు వరల్డ్ వైడ్ 8 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు 4 కోట్ల రూపాయల షేర్ వచ్చింది.

సుధాకర్ చెరుకూరి నిర్మాతగా తెరకెక్కిన ఈ సినిమాలో రవితేజ, డిప్యూటీ కలెక్టర్ గా కనిపించాడు. లాంగ్ గ్యాప్ తర్వాత వేణు తొట్టెంపూడి ఈ సినిమాతో రీఎంట్రీ ఇవ్వగా.. రజీషా విజయన్, దివ్యాంశ కౌశిక్ హీరోయిన్లుగా నటించారు. రామారావు ఆన్ డ్యూటీ సినిమాకు ఏపీ,నైజాంలో మొదటి వారాంతం (3 రోజుల్లో) వచ్చిన షేర్లు ఇలా ఉన్నాయి

నైజాం - 1.21 కోట్లు సీడెడ్ - 64 లక్షలు ఉత్తరాంధ్ర - 54 లక్షలు ఈస్ట్ - 37 లక్షలు వెస్ట్ - 20 లక్షలు గుంటూరు - 31 లక్షలు నెల్లూరు - 15 లక్షలు కృష్ణా - 23 లక్షలు