Ram reveals the back end story of The Warrior

Monday,July 11,2022 - 11:17 by Z_CLU

ప్రతి సినిమా వెనక ఓ కథ ఉంటుంది. అది కార్యరూపం దాల్చడానికి ఓ ప్రాసెస్ ఉంటుంది. Ram Pothineni హీరోగా నటించిన The Warrior స్టోరీ వెనక కూడా అలాంటి ఓ కథ ఉంది. ఈ విషయాన్ని రామ్ స్వయంగా బయటపెట్టాడు.

"పోలీస్ కథ చేద్దామనుకున్నాను. ఐదు కథలు విన్నాను. అన్నీ ఒకేలా అనిపించి కొన్ని రోజులు పోలీస్ కథలు వద్దని, వినకూడదని అనుకున్న టైమ్‌లో లింగుస్వామి గారు హైదరాబాద్ వచ్చారు. ముందు పోలీస్ కథ అని చెప్పలేదు. వచ్చాక చెప్పారు. ఫార్మాలిటీ కోసం విందామని అనుకున్నాను. విన్న తర్వాత... పోలీస్ కథ చేస్తే, ఇటువంటి కథ చేయాలనిపించింది. కథలో ఎమోషన్ అంతలా ఆకట్టుకుంది. నేను స్క్రిప్ట్ విన్న తర్వాత ఎప్పుడూ ట్వీట్ చేయలేదు. ఫస్ట్ టైమ్ ఈ సినిమాకు ట్వీట్ చేశా."

ఇలా ది వారియర్ మేకింగ్ ప్రాసెస్ ను బయటపెట్టాడు రామ్. ఈ సినిమా టైమ్ లో స్పైనల్ కార్డ్ కు దెబ్బ తగిలి తీవ్రంగా గాయపడ్డాడు రామ్. మరోవైపు చూస్తే పోలీస్ రోల్ కోసం మేకోవర్ అవ్వాల్సిన పరిస్థితి. అయినప్పటికీ కష్టపడి జిమ్ చేసి, పోలీస్ గెటప్ వేశాడు ఈ హీరో. ఇదంతా అభిమానుల ప్రేమ వల్లనే సాధ్యమైందన్నాడు.

ఓవైపు ఇంతలా దెబ్బలు తగిలినప్పటికీ, మరోవైపు అభిమానుల్ని నిరాశపరచకూడదనే ఉద్దేశంతో ఎనర్జీ తగ్గకుండా డాన్స్ చేశానని చెప్పుకొచ్చాడు రామ్. కృతి శెట్టి హీరోయిన్ గా, లింగుసామి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 14వ తేదీన థియేటర్లలోకి వస్తోంది.