Ram Pothineni’s The Warriorr Trailer Review

Saturday,July 02,2022 - 02:32 by Z_CLU

రామ్ పోతినేని హీరోగా లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ది వారియర్' సినిమాకు సంబంధించి లేటెస్ట్ గా ట్రైలర్ రిలీజైంది.  రామ్  డైలాగ్ తో స్టార్ట్ అయిన ట్రైలర్ లో మాస్ కి కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ మిక్స్ చేసి విజువల్ ట్రీట్ ఇచ్చారు. ముఖ్యంగా రామ్ ప్లే చేసిన సత్య IPS కేరెక్టర్ ఏ రేంజ్ లో ఉండబోతుందో చూపిస్తూ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేసింది ట్రైలర్. అలాగే ఆది పినిశెట్టి విలనిజం చూపిస్తూ వచ్చే విజువల్స్ కూడా ట్రైలర్ లో ఎట్రాక్ట్ చేసి సినిమాలో రామ్ -ఆది పినిశెట్టి మధ్య వచ్చే గేమ్, యాక్షన్ ఎపిసోడ్స్ పై ఆసక్తి నెలకొల్పాయి.

కృతి శెట్టి రేడియో జాకీ రోల్ లో కనిపించనుందని ట్రైలర్ లో చెప్పేశారు మేకర్స్. సినిమాలో రామ్ - కృతి శెట్టి మధ్య వచ్చే లవ్ ట్రాక్ అలరించనుందని కొన్ని సీన్స్ చూస్తుంటే అర్థమవుతుంది. అలాగే రామ్ -నదియా మధ్యే వచ్చే సన్నివేశాలు కూడా సినిమాలో ఆకట్టుకుంటాయని తెలుస్తుంది.  రామ్ హీరోయిజం ఎలివేట్ చేస్తూ వచ్చే షాట్స్ , యాక్షన్ ఎపిసోడ్స్ , ఆది పినిశెట్టి విలనిజంతో వచ్చే సీన్స్ , బులెట్ సాంగ్ విజువల్స్ తో ది వారియర్ ట్రైలర్ సూపర్ హిట్ అనిపించుకుంది.  తెలుగు ,తమిళ్ భాషలో రిలీజైన ట్రైలర్  13 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసి 15 మిలియన్ కి చేరువలో ఉంది.

  ఓవరాల్ గా రామ్ - లింగుస్వామి కాంబినేషన్ లో ఓ పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ రానుందని ట్రైలర్ కట్ తో క్లియర్ కట్ గా చెప్పేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమాను జులై 14 న థియేటర్స్ లోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

  *Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics