Ram Pothineni injured RAPO19 shoot halted

Monday,October 04,2021 - 03:59 by Z_CLU

టాలీవుడ్ లో తనదైన ప్రత్యేక శైలితో ఆడియన్స్ ను ఆకట్టుకొని, తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు హీరో 'రామ్ పోతీనేని' (Ram Pothineni). ఎనర్జిటిక్ హీరో రామ్ నటిస్తున్న 19 సినిమా 'రాపో19' (RaPo19)షూటింగ్ జరుగుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాకి తమిళ డైరెక్టర్ లింగుస్వామి (Tamil Director Lingusamy) దర్శకత్వం వహిస్తున్న సంగతి కూడా మన అందరికీ తెలిసిందే.

ఇంకా టైటిల్ ఫిక్స్ కానీ ఈ సినిమాను రామ్ అభిమానులు 'రాపో19' గా పిలుస్తున్నారు. రాపో19 సినిమాలో రామ్ సరసన ఉప్పెన ఫేమ్ 'కృతి శెట్టి హీరోయిన్'గా (Uppena Movie Fame Krithi Shetty) నటిస్తోంది. అంతేకాకూండా ఈ సినిమాలో కోలీవుడ్ (Kollywood) స్టార్ హీరో ఆర్య (Aarya) విలన్ గా నటించటం మరో విశేషం.

ram neck injury

తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా ద్వారా లింగుసామికి డైరెక్టర్ గా తెలుగులో ఆరంగేట్రం చేయనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగా హీరో రామ్ కు గాయాలయ్యాయి.

సినిమాలో పాత్రకు తగినట్టు బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కోసం జిమ్ లో చాలా సమయం కష్టపడుతున్నాడు హీరో రామ్. ఇలా అధికంగా వర్కౌట్ లు చేయటం కారణంగా హీరో రామ్ (Hero Ram) మెడకు గాయం అయింది. తన మెడకు దెబ్బ తగిలిన విషయాన్ని రామ్ స్వయంగా వెల్లడించాడు. దీంతో అతడు నటిస్తున్న కొత్త సినిమా షూటింగ్ ఆగిపోయింది. ప్రస్తుతం ఈ సినిమా సెకెండ్ షెడ్యూల్ లో ఉంది.

  • - Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics