Ram Pothineni, Boyapati Srinu’s #BoyapatiRAPO release date out

Tuesday,March 28,2023 - 10:56 by Z_CLU

బోయపాటి శ్రీను,  రామ్ పోతినేని కాంబినేషన్ లో రూపొందుతున్న క్రేజీ మూవీ #BoyapatiRAPO శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాలో అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో  పాటు యాక్షన్, మాస్  ఎక్కువగా ఉండబోతున్నాయి. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి  భారీ బడ్జెట్ తో  ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని అనౌన్స్ చేశారు మేకర్స్. #BoyapatiRAPO దసరా కానుకగా అక్టోబర్ 20న థియేటర్లలోకి రానుంది. మాస్ తో పాటు ఫ్యామిలీస్ ని మెప్పించే సినిమాకి ఇది సరైన తేదీ. దసరా సెలవులు సినిమాకి  కలిసిరాబోతున్నాయి. అనౌన్స్ మెంట్ పోస్టర్ లో రామ్ తన చేతితో గంగిరెద్దు (ఎద్దు)ని లాగుతూ పోస్టర్ లో రగ్డ్, మాస్ గా కనిపిస్తున్నారు. పోస్టర్ లో రామ్ వైల్డ్ నెస్ గా కనిపిస్తున్నాడు. బోయపాటి శ్రీను రామ్ ని సరికొత్త మాస్ క్యారెక్టర్ లో చూపించబోతున్నాడని అర్థమవుతుంది. మోస్ట్ హ్యాపనింగ్ హీరోయిన్  శ్రీలీల రామ్ కు జోడిగా నటిస్తోంది. ఇందులో ప్రముఖ పాత్రలలో కొంతమంది ప్రముఖ నటులు కూడా నటిస్తున్నారు.ఎస్ఎస్ థమన్ సంగీతం సమకూరుస్తున్నారు. తమ్మిరాజుఎడిటింగ్ అందిస్తుండగా, సంతోష్ డిటాకే కెమరామెన్ గా పని చేస్తున్నారు.  #BoyapatiRAPO హిందీ, అన్ని సౌత్ ఇండియన్ భాషలలో విడుదల అవుతుంది.