Ram Charan’s next film Announced with Director Buchi Babu

Monday,November 28,2022 - 01:54 by Z_CLU

Ram Charan's next film Announced with Director Buchi Babu

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొత్త సినిమాకు సంబంధించి ఎనౌన్స్ మెంట్ వచ్చేసింది. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ సినిమా చేస్తున్న రామ్ చరణ్ నెక్స్ట్ బుచ్చి బాబు దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు. తాజాగా ఈ కాంబో సినిమాను అఫీషియల్ గా ఎనౌన్స్ చేశారు. ఉప్పెన సినిమాతో బ్లాక్ బస్టర్ డెబ్యూ ఇచ్చిన  బుచ్చిబాబుకి ఇది రెండో సినిమా. "కొన్ని సార్లు తిరుగుబాటు అవసరం" అంటూ తిరుగుబాటు నేపథ్యంలో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కనుందని దర్శకుడు బుచ్చిబాబు ఫ్యాన్స్ కి హింట్  ఇచ్చాడు.

 

మైత్రి మూవీస్ సమర్పణలో సుకుమార్ రైటింగ్స్ తో కలిసి వ్రిద్ది సినిమాస్ బేనర్ పై సతీష్ కిలారు నిర్మించనున్నాడు. ఈ సినిమాతో సతీష్  నిర్మాతగా ఇండస్ట్రీకి పరిచయం అవ్వబోతున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజిలో ఉన్న ఈ సినిమాకు స్క్రిప్ట్ లాక్ అయింది. శంకర్ సినిమా కంప్లీట్ అవ్వగానే చిన్న బ్రేక్ తీసుకొని చరణ్ ఈ సినిమా మొదలు పెడతాడని తెలుస్తుంది.

  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics