Ram Charan Speech highlights in ‘Uppena’ Success Celebrations

Thursday,February 18,2021 - 12:19 by Z_CLU

నిన్న రాజమండ్రిలో గ్రాండ్ గా జరిగిన 'ఉప్పెన' సక్సెస్ సెలెబ్రేషన్స్ కి ముఖ్య అతిథిగా వచ్చిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన స్పీచ్ లో అందరిని ఆకట్టుకున్నాడు.

రామ్ చరణ్ మాట్లాడుతూ "  పది నెలల పాటు అనుభవించిన బాధ నుండి బయటికి  వచ్చి మళ్ళీ మన తెలుగు సినిమా పరిశ్రమను కలెక్షన్స్ తో నిలబెట్టి మేమున్నాం అంటూ దైర్యాన్నిచ్చిన అభిమానులకు అలాగే ప్రేక్షకులకు నా ధన్యవాదాలు. నిజంగా ఇతర పరిశ్రమలకు కూడా మన సినిమా విజయాలు ఎంతో దైర్యన్నిచ్చాయి. అందుకు ఎంతో సంతోషంగా ఉంది. మగధీర తర్వాత నాకు మళ్ళీ అలాంటి గొప్ప విజయం అందించిన మా నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్ నవీన్ గారికి , రవి గారికి ఈ సినిమా సక్సెస్ సందర్భంగా నా ప్రత్యేక శుభాకాంక్షలు. ముగ్గురు కొత్త వాళ్ళతో ఈ సినిమాను ఎంతో డేర్ చేసి నిర్మించిన వారిని మెచ్చుకోవాలి. దేవి సంగీతం వల్ల సన్నివేశాలు థియేటర్స్ లో కుర్చోబెట్టాయి. జల జల జలపాతం నువ్వు నా ఫేవరేట్ సాంగ్. వైష్ణవ్ తేజ్ హీరో అవుతా అంటే ముందు ఎంకరేజ్ చేసింది నాన్న చిరంజీవి గారు ,  కళ్యాణ్ బాబాయ్.   వైష్ణవ్ ని ఇతర దేశాల్లో ట్రైనింగ్ ఇప్పించి తనకి ఒక గురువులా ఉన్నారు పవన్ బాబాయ్. బుచ్చి బాబు సుకుమార్ గారికి బెస్ట్ స్టూడెంట్ అని నిరూపించుకున్నాడు. ఇక కృతి మైత్రి మూవీ మేకర్స్ వారికి కూడా డేట్స్ ఇవ్వలేనంత బిజీ అవుతుందని అవ్వాలని కోరుకుంటున్నాను. టీం అందరికీ మరోసారి కంగ్రాట్స్ " అన్నారు.