Rakul enjoining in Maldives

Friday,November 20,2020 - 01:22 by Z_CLU

హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్.. తన సినిమాల నుంచి చిన్న బ్రేక్ తీసుకుంది. ఫ్యామిలీతో కలిసి మాల్దీవుల్లో ల్యాండ్ అయింది. ఓ ఫైవ్ స్టార్ రిసార్ట్ లో ప్రస్తుతం సేదతీరుతోంది.

లాక్ డౌన్ టైమ్ లో చాలా స్ట్రెస్ ఫీల్ అయింది Rakul. ఓ వైపు షూటింగ్స్ లేకపోవడంతో పాటు మరోవైపు డ్రగ్స్ ఆరోపణలు రావడంతో ఆమె చాలా ఇబ్బంది పడింది. ఈ ఒత్తిడి నుంచి బయటపడేందుకు కుటుంబంతో కలిసి ఆమె ఇలా వెకేషన్ ప్లాన్ చేసింది.

ప్రపంచమంతా కరోనా వైరస్ ఉండడం, కొన్ని వెస్ట్రన్ కంట్రీస్ లో సెకెండ్ వేవ్ మొదలవ్వడంతో చాలామంది మాల్టీవుల్ని తమ డెస్టినేషన్ గా మార్చుకుంటున్నారు. కాజల్ ఇక్కడే తన హనీమూన్ ను ఎంజాయ్ చేస్తోంది.

రీసెంట్ గా తాప్సి కూడా తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి మాల్దీవులు వెళ్లొచ్చింది. ప్రణీత, మెహ్రీన్ కూడా రీసెంట్ గా మాల్దీవులు టచ్ చేశారు. ఇప్పుడు రకుల్ కూడా అక్కడే రిలాక్స్ అవుతోంది.

Also Check - రకుల్ లేటెస్ట్ స్టిల్స్