Rajtarun Back on track

Thursday,October 01,2020 - 02:38 by Z_CLU

వరుస అపజయాలతో సతమతమవుతున్న యంగ్ హీరో Raj Tarun 'ఒరేయ్ బుజ్జిగా' తో మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కాలని చూస్తున్నాడు . OTT లో రిలీజ్ కి రెడీ అయిన ఈ సినిమా తర్వాత మళ్ళీ Vijay Kumar Konda తోనే సినిమా చేస్తున్నాడు. వీరిద్దరి కాంబినేషన్ లో రానున్న ఈ సినిమా థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కనుంది. ఈ సినిమాతో పాటే శ్రీనివాస్ గవిరెడ్డి డైరెక్షన్ లో మరో సినిమాను స్టార్ట్ చేయనున్నాడు రాజ్ తరుణ్.

ఈ రెండు సినిమాలు కాకుండా మరో రెండు సినిమాలు లైన్లో పెట్టాడు. సురేష్ ప్రొడక్షన్స్ లో 'Dream Girl' రీమేక్ చేయబోతున్న రాజ్ తరుణ్.. సంతోష్ అనే కొత్త దర్శకుడితో మరో థ్రిల్లర్ సినిమా రెడీ చేసుకున్నాడు. మొత్తంగా ఇప్పుడీ కుర్ర హీరో చేతిలో నాలుగు సినిమాలున్నాయి. మరి వీటితో ఎలాంటి విజయాలు అందుకుంటాడో వేచి చూడాలి.