RajaVikramarka Trailer Review

Monday,November 01,2021 - 05:38 by Z_CLU

కార్తికేయ గుమ్మకొండ హీరోగా శ్రీ సరిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'రాజా విక్రమార్క' ట్రైలర్ రిలీజైంది.  టీజర్ తో ఎట్రాక్ట్ చేసిన ఈ సినిమా ఇప్పుడు ట్రైలర్ తో ఓ మోస్తరు అంచనాలు క్రియేట్ చేస్తుంది.

టీజర్ లానే ట్రైలర్ ని కూడా ఎక్కువ భాగం ఎంటర్టైన్ మెంట్ తోనే కట్ చేశారు. కాకపోతే  సినిమాలో ఉన్న సీరియస్ నెస్ కూడా సాంపిల్ గా చూపించారు. ముఖ్యంగా సినిమాలో కార్తికేయ క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో ఇంకాస్త డీటెయిల్ గా ట్రైలర్ లో చూపించారు. అలాగే సినిమాలో మంచి లవ్ ట్రాక్ ఉందని చెప్పేలా లవ్ సీన్స్ యాడ్ చేసి ఆ ట్రాక్ కూడా ట్రైలర్ లో హైలైట్ చేశారు. ఓవరాల్ ఈ ట్రైలర్ తో సినిమాలో అన్ని అంశాలు ఉన్నాయని చెప్పే ప్రయత్నం చేశారు మేకర్స్.

కార్తికేయ ఎన్ ఐ ఎ ఏజెంట్ గా నటిస్తున్న ఈ సినిమాలో తాన్య రవీంద్రన్ హీరోయిన్ గా నటిస్తుంది. సాయి కుమార్ , తనికెళ్ళ భరణి ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. కార్తికేయ గుమ్మకొండ నటనతో కొత్త తరహా కమర్షియల్ సినిమాను ప్రేక్షకులకు అందిస్తున్నారనేది అర్థమైవుతుంది. ట్రైలర్ చూస్తే దర్శకుడు శ్రీ సరిపల్లి ఈ సినిమాను పర్ఫెక్ట్ గా డీల్ చేశాడనే పాజిటివ్ నెస్ కనిపిస్తుంది. ఆదిరెడ్డి సమర్పకుడిగా ఉన్న ఈ సినిమాకు నిర్మాత '88' రామారెడ్డి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా నవంబర్ 12న విడుదలవుతుంది.

Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics