Rajasekhar’s Shekar Movie ready for Sankranthi Release

Monday,January 03,2022 - 01:27 by Z_CLU

ఆర్ఆర్ఆర్ రిలీజ్ వాయిదా పడింది. రాధేశ్యామ్ విడుదలపై అనుమానాలున్నాయి. దీంతో చాలా సినిమాలు సంక్రాంతి బాక్సాఫీస్ బరిలోకి వచ్చేందుకు ట్రై చేస్తున్నాయి. ఇప్పటికే కొన్ని సినిమాలు రిలీజ్ డేట్స్ ఎనౌన్స్ చేశాయి. ఇప్పుడు తాజాగా రేసులోకి ఎంటరయ్యారు సీనియర్ నటుడు రాజశేఖర్.

యాంగ్రీ స్టార్ రాజశేఖర్ హీరోగా నటిస్తున్న సినిమా శేఖర్. కెరీర్ లో ఈయనకు ఇది 91వ చిత్రం. ఇప్పుడీ సినిమా సంక్రాంతి బరిలో నిలిచింది. త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటించబోతున్నారు. పెగాసస్ సినీ కార్ప్, టారస్ సినీ కార్ప్, సుధాకర్ ఇంపెక్స్ ఐపీఎల్, త్రిపురా క్రియేషన్స్ పతాకాలపై బీరం సుధాకర్ రెడ్డి, శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్, వెంకట శ్రీనివాస్ బొగ్గరం నిర్మిస్తున్నారు.

రాజశేఖర్ భార్య జీవిత రాజశేఖర్ ఈ సినిమాకు దర్శకురాలు. మూవీకి స్క్రీన్ ప్లే కూడా ఆమె అందించడం హైలెట్. లాంగ్ గ్యాప్ తర్వాత రాజశేఖర్ - జీవిత కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో శేఖర్ (Shekar Movie)పై చాలా అంచనాలున్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టే ఫస్ట్ గ్లింప్స్ సూపర్ హిట్టయింది.

రాజశేఖర్, జార్జ్ రెడ్డి ఫేమ్ ముస్కాన్, అభినవ్ గోమఠం, కన్నడ కిషోర్, సమీర్, తనికెళ్ళ భరణి, రవివర్మ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందించాడు.

రాజశేఖర్ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ కు ఇప్పటికే ట్రెమండస్ రెస్పాన్స్ రాగా.. సినిమాలో ఆయన పెర్ఫార్మెన్స్ కు మరింత అప్లాజ్ వస్తుందని జీవిత రాజశేఖర్ గట్టిగా చెబుతున్నారు.