Rajamouli Voice Over for Prabhas’s Radheshyam

Monday,February 28,2022 - 12:11 by Z_CLU

రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్ తెరకెక్కిస్తున్న బిగ్గెస్ట్ బడ్జెట్ లవ్ స్టోరీ రాధే శ్యామ్. 1970ల్లో జరిగే అందమైన ప్రేమకథ ఇది. ఇటలీ, హైదరాబాద్‌లోని అద్భుతమైన లొకేషన్స్‌కు తోడు కోట్లాది రూపాయల అత్యద్భుతమైన సెట్స్‌తో పాన్ ఇండియన్ స్థాయిలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు రాధాకృష్ణ కుమార్. ఇప్పటికే విడుదలైన రాధే శ్యామ్ పాటలు, ట్రైలర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్‌డేట్ వచ్చింది.

ఈ సినిమాకు నెరేటర్‌గా మారిపోయారు పాన్ ఇండియన్ దర్శకుడు రాజమౌళి. రాధే శ్యామ్ సినిమాకు ఈయన వాయిస్ ఓవర్ ఇస్తున్నారు. తెలుగు వెర్షన్ కు జక్కన్న వాయిస్ ఓవర్ ఇస్తున్నారు. ఈయన వాయిస్ సినిమాకు ప్లస్ కానుందంటున్నారు మేకర్స్. అలాగే కన్నడలో శివరాజ్ కుమార్.. మలయాళంలో పృథ్విరాజ్ సుకుమారన్.. తమిళంలో సత్యరాజ్ రాధే శ్యామ్ సినిమా కోసం వాయిస్ ఓవర్ అందించనున్నారు. హిందీలో బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ రాధే శ్యామ్ సినిమాకు వాయిస్ ఓవర్ ఇచ్చారు.

ఇప్పటివరకు రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్‌లో ఎన్నడూ లేనంత బిగ్గెస్ట్ రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్. ఇండియా, ఓవర్సీస్‌లో అత్యంత ఘనంగా ఈ సినిమా రిలీజ్‌కు సన్నాహాలు చేస్తున్నారు. ఓవర్సీస్ లో ఈ సినిమాకు ఇప్పటివరకు 1116 స్క్రీన్స్ దక్కాయి. రిలీజ్ టైమ్ కు కనీసం మరో 200 స్క్రీన్స్ ఆడ్ అవుతాయని భావిస్తున్నారు.

యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ బ్యానర్లపై తెరకెక్కుతున్న ఈ సినిమాను మార్చి 11, 2022న సినిమా విడుదల చేయబోతున్నారు.