Rajamouli gives clarity on RRR Trailer in recent Promotions

Thursday,November 25,2021 - 06:24 by Z_CLU

Rajamouli gives clarity on RRR Trailer in recent Promotions

ఎన్టీఆర్ , రామ్ చరణ్ కాంబినేషన్ లో రాజమౌళి తెరకెక్కిస్తున్న RRR సినిమాపై భారీ అంచనాలు నెలకొంటున్నాయి. ఇటివలే రిలీజైన గ్లిమ్స్ తో పాటు 'నాటు నాటు' సాంగ్ సినిమాపై భారీ బజ్ క్రియేట్ చేసింది. ఇప్పుడు సినిమాలో "జనని" అనే సాంగ్ ని రిలీజ్ చేస్తున్నారు. ఈ పాటను #RRRSoulAnthem పేరుతో రేపు రిలీజ్ చేయబోతున్నారు. ఈ సాంగ్ మీడియా స్క్రీనింగ్ ప్రెస్ మీట్ లో రాజమౌళి సినిమా ప్రమోషన్స్ పై మరింత ఇన్ఫర్మేషన్ అందించారు.

డిసెంబర్ మొదటి వారంలో ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నాం అంటూ ట్రైలర్ అప్ డేట్ ఇచ్చాడు. ఇక త్వరలోనే ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుందని అలాగే అన్ని భాషల్లో టీం అందరూ కలిసి మీడియాతో ఇంటరాక్ట్ అవుతామని తెలిపాడు. సాంగ్ స్క్రీనింగ్ ప్రెస్ మీట్ లో మాత్రం ఎలాంటి ప్రశ్నలకు తావివ్వలేదు జక్కన్న. తను చెప్పాలనుకున్నది మాత్రమే చెప్పేసి మిగతా విషయాలు త్వరలోనే మాట్లాడదాం , నాకూ చాలా చెప్పాలని ఉంది మీకూ ఎన్నో అడగాలని ఉంది త్వరలోనే కలుద్దాం మీకు అలుపు వచ్చే వరకూ మీ ప్రశ్నలకు సమాధానం ఇస్తాను అంటూ చెప్పేసి స్క్రీనింగ్ కంటే ముందే వెళ్ళిపోయాడు రాజమౌళి.

ఏదేమైనా రాజమౌళి ఇచ్చిన అప్ డేట్ తో RRR TRAILER కోసం ఎదురుచూస్తున్న మూవీ లవర్స్ కి సమాధానం వచ్చేసింది. ఇక డిసెంబర్ నుండి ప్రమోషన్స్ పీక్స్ లో ఉంటాయని జక్కన్న చెప్పకనే చెప్పాడు. ట్రైలర్ రిలీజ్ రోజే టీం మీడియాతో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో ఉన్న RRR వచ్చే ఏడాది జనవరి 7న గ్రాండ్ గా రిలీజ్ అవ్వనుంది.  డివీవీ ఎంటర్టైన్ మెంట్స్ బేనర్ పై దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics