Raja Raja Chora – makers announces teaser release date in unique style

Friday,June 11,2021 - 05:15 by Z_CLU

ఇటివలే ఓ షార్ట్ వీడియోతో శ్రీ విష్ణు చెప్పినట్టే 'రాజ రాజ చొర' సినిమా నుండి మొదటి అప్డేట్ వచ్చేసింది. సినిమా టీజర్ ఎనౌన్స్ మెంట్ డేట్ తెలియజేస్తూ ఓ కాన్సెప్ట్ తో వీడియో రిలీజ్ చేశారు మేకర్స్. చొర గాథ అంటూ గంగవ్వతో ఓ కథ చెప్పించి ఇంప్రెస్ చేశారు. రాజు అతని కీరిటం ఎత్తుకుపోయిన దొంగ మధ్య జరిగే ఓ ఆసక్తికరమైన కథతో గంగవ్వ చెపిన స్టోరీ అందరినీ ఆకట్టుకుంటుంది. టీజర్ ఈ నెల 18న విడుదల చేయనున్నట్లు ఈ వీడియో ద్వారా ప్రకటించారు.

సినిమా కథను ముందే ఈ వీడియో ద్వారా చెప్తూ సినిమాలో ఎంత ఫన్ ఉంటుందో హింట్ ఇచ్చేశాడు దర్శకుడు. శ్రీ విష్ణు హీరోగా తెరకెక్కిన ఈ సినిమాతో డైరెక్టర్ వివేక్ ఆత్రేయ దగ్గర పనిచేసిన హాసిత్ గోలి దర్శకుడిగా పరిచమవుతున్నాడు. శ్రీవిష్ణు సరసన మేఘా ఆకాష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో రవిబాబు ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ , పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు వివేక్ సాగర్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

[caption id="attachment_171038" align="alignnone" width="457"]Sree Vishnu Raja Raja Chora zeecinemalu 1 రాజ రాజ చోర[/caption]

ఇటివలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. రాజ రాజ చొర శ్రీ విష్ణు నుండి వస్తున్న అవుట్ అండ్ అవుట్ కామెడీ సినిమా అని ఇప్పటికే హింట్ ఇచ్చిన మేకర్స్ త్వరలోనే రిలీజ్ చేయబోయే టీజర్ తో పూర్తిగా క్లారిటీ ఇవ్వనున్నారు.

  • - Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics