Raghava Lawrence ‘Rudrudu’ Releasing on 23rd December, 2022

Monday,July 04,2022 - 11:01 by Z_CLU

రాఘవ లారెన్స్ కధానాయకుడిగా కతిరేసన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్  థ్రిల్లర్‌'రుద్రుడు'. ఫైవ్ స్టార్ క్రియేషన్స్ ఎల్‌ఎల్‌పి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా కతిరేశన్ సమర్పిస్తున్నారు.2022 క్రిస్మస్‌ కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు గతంలో వెల్లడించిన నిర్మాతలు తాజాగా రిలీజ్ డేట్ ని ఖరారు చేశారు. డిసెంబర్ 23న చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.

ఈ సందర్భంగా విడుదల చేసిన సెకండ్ లుక్ పోస్టర్ లో లారెన్స్ లుక్ ఇంటరెస్టింగ్ గా వుంది.    వైన్ బాటిల్ ని చేతిలో పట్టుకొని సీరియస్ గా  చూస్తున్న  లుక్  టెర్రిఫిక్ గా వుంది.

'ఈవిల్ ఈజ్ నాట్ బోర్న్ , ఇట్ ఈజ్ క్రియేటడ్' అనే ఉపశీర్షికతో వస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ కి కూడా భారీ స్పందన వచ్చింది. శరత్ కుమార్ కీలక పాత్రలో నటిస్తుండగా లారెన్స్ సరసన ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటిస్తోంది.

జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ఆర్ డి రాజశేఖర్-ఐఎస్ సి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఆంథోనీ ఎడిటర్ గా , శివ-విక్కీ స్టంట్స్ కంపోజ్ చేస్తున్నారు.

తారాగణం: రాఘవ లారెన్స్, శరత్ కుమార్, ప్రియా భవానీ శంకర్, పూర్ణిమ భాగ్యరాజ్, నాజర్ తదితరులు

సాంకేతిక విభాగం: దర్శకత్వం - కతిరేశన్ నిర్మాత- కతిరేశన్ బ్యానర్: ఫైవ్ స్టార్ క్రియేషన్స్ ఎల్ఎల్పీ సంగీతం: జి.వి. ప్రకాష్ కుమార్ డీవోపీ : ఆర్ డి రాజశేఖర్-ఐఎస్ సి ఎడిటర్: ఆంథోనీ స్టంట్స్: శివ - విక్కీ

  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics