Radheshyam Release : Prabhas mania all over !

Wednesday,March 09,2022 - 01:03 by Z_CLU

పాన్ వరల్డ్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ మూవీ 'రాధేశ్యామ్' రెండు రోజుల్లో థియేటర్స్ లోకి రాబోతుంది. భారీ అంచనాలతో వస్తున్న ఈ సినిమాపై ట్రేడ్ వర్గాల్లో కూడా మంచి ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. ఇప్పటికే ఆన్లైన్ బుకింగ్స్ జోరుగా జరుగుతున్నాయి. అన్ని చోట్ల మొదటి రోజు కి సంబంధించి హౌస్ ఫుల్స్ అవుతున్నాయి. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఇప్పుడు ప్రభాస్ మేనియా కనిపిస్తుంది.

'బహుబాలి' ఫ్రాంచైజీ తో వరల్డ్ వైడ్ గా ఇండియన్ స్టార్ అంటూ ఎనలేని గుర్తింపు అందుకున్న ప్రభాస్ సినిమా కావడంతో ఓవర్సీస్ లో కూడా భారీ బుకింగ్స్ జరుగుతున్నాయి. టీం కూడా సినిమాను భారీ స్థాయిలో ప్రమోట్ చేస్తూ బజ్ క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యారు. ప్రెజెంట్ సోషల్ మీడియాలో కూడా 'రాధేశ్యామ్' ట్యాగ్స్ తో ప్రభాస్ మేనియానే కనిపిస్తుంది.

తెలంగాణాలో కూడా ఆన్లైన్ టికెట్స్ భారీగా సేల్ అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా కొత్త జీవో ప్రవేశపెట్టి టికెట్ రెట్లు పెంచుతూ, ఐదు షోలకు పర్మీషణ్ ఇవ్వడంతో అక్కడ కూడా మార్నింగ్ షో హంగామా మొదలైంది. ఆల్మోస్ట్ అన్ని ఏరియాల్లో ఎల్లుండి తెల్లవారు జామునే అక్కడ షో పడనుంది. ఇక హైదరాబాద్ లో కూడా ఎప్పటిలానే బెన్ఫిట్ షోస్ ఉంటాయని తెలుస్తుంది. ఏదేమైనా రిలీజ్ కి ముందే తన మేనియాతో ప్రభాస్ 'రాధేశ్యామ్' గురించి గట్టిగా మాట్లాడుకునేలా చేస్తున్నాడు. మరి ఈ సినిమాతో ప్రభాస్ ఎన్ని కోట్లు కొల్లగొడతాడో .. ఎలాంటి కొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తాడో.. చూడాలి.

Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics