Radhe Shyam teaser release date is here

Wednesday,October 20,2021 - 03:47 by Z_CLU

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రాధేశ్యామ్ టీజర్ రెడీ అయింది. మరో 3 రోజుల్లో (23న) రాధేశ్యామ్ టీజర్ రాబోతోంది. కేవలం టీజర్ వస్తోందని ప్రకటించి ఊరుకోలేదు మేకర్స్. ఆ టీజర్ లో ఏం ఉండబోతోందనే విషయాన్ని కూడా రివీల్ చేశారు.

రాధేశ్యామ్ సినిమాలో విక్రమాదిత్య అనే పాత్రలో కనిపించబోతున్నాడు ప్రభాస్. ఆ క్యారెక్టర్ ఎలా ఉండబోతోందనే విషయాన్ని టీజర్ లో చెప్పబోతున్నారు. ఈ మేరకు Who is Vikramaditya? అనే క్వశ్చన్ ను వదిలారు యూవీ క్రియేషన్స్ మేకర్స్

radheshyam prabhas

రాధేశ్యామ్ లో విక్రమాదిత్య పాత్రలో ప్రభాస్, ప్రేరణ పాత్రలో పూజాహెగ్డే కనిపించబోతున్నారు. వీళ్లలో పూజాహెగ్డే డాక్టర్ గా కనిపించబోతోందనే టాక్ నడుస్తోంది. అయితే ప్రభాస్ క్యారెక్టర్ ఎలా ఉండబోతోందనే విషయంపై మాత్రం చాలా స్పెక్యులేషన్ నడుస్తోంది. ఆ రూమర్లకు, అంచనాలకు 23వ తేదీతో చెక్ పెట్టబోతున్నారు మేకర్స్

రాధాకృష్ణ కుమార్ డైరక్ట్ చేసిన ఈ సినిమాను యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణమూవీస్, టీ-సిరీస్ కలిసి నిర్మించాయి. జస్టిన్ ప్రభాకరన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లలోకి రాబోతున్నాడు రాధేశ్యామ్. పాన్ ఇండియా లెవెల్లో పలు భాషల్లో ఒకేసారి విడుదలకాబోతోంది ప్రభాస్ మూవీ.

  • - Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics