Raashi Khanna in Pakka Commercial directed by Maruthi

Tuesday,April 13,2021 - 06:10 by Z_CLU

మ్యాచో స్టార్ గోపీచంద్ - డైరెక్టర్ మారుతి కాంబినేషన్ లో 'పక్కా కమర్షియల్' సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం హైదరాబాద్ లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో హీరోయిన్ గా మళ్ళీ రాశి ఖన్నా ని రిపీట్ చేస్తున్నాడు డైరెక్టర్ మారుతి. ఇటివలే మారుతి డైరెక్షన్ లో వచ్చిన 'ప్రతీ రోజు పండగే' లో సాయి ధరమ్ తేజ్ సరసన్ హీరోయిన్ గా నటించింది రాశి. ఆ సినిమాలో ఏంజెల్ ఆర్నా అనే పల్లెటూరి అమ్మాయి పాత్రలో అలరించింది. టిక్ టాక్ వీడియోస్ చేస్తూ సినిమాలో మంచి కామెడీ పండించి సక్సెస్ లో పార్ట్ అయ్యింది. అందుకే మళ్ళీ తన సినిమాలో హీరోయిన్ గా రాశి నే ఎంచుకున్నాడు మారుతి. ఈ సినిమాలో రాశి మరో డిఫరెంట్ క్యారెక్టర్ తో ఎంటర్టైన్ చేస్తుందని తెలుస్తుంది.

రాశి సెట్ లో ఉన్న ఓ వర్కింగ్ స్టిల్ రిలీజ్ చేసి ఆమెకి వెల్కం చెప్పారు మేకర్స్. సినిమాలో రాశి ఖన్నా లాయర్ పాత్రలో నటిస్తుంది. వర్కింగ్ స్టిల్ లో కూడా రాశి లాయర్ గెటప్ లోనే ఉంది. ఇక గోపీచంద్ తో రాశి 'జిల్','ఆక్సిజన్' సినిమాల్లో నటించింది. ఈ కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా ఇది. వీరిద్దరి మధ్య వచ్చే లవ్ ట్రాక్ సరదాగా ఉంటూ అలరించేలా ఉంటుందని యూనిట్ అంటున్నారు.

అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ 2, యూవీ క్రియేషన్స్ బేనర్స్ పై బన్నీ వాస్ నిర్మిస్తున్న ఈ సినిమాకు జేక్స్ బిజోయ్ మ్యూజిక్ కంపోజర్. పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్ తో యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా అక్టోబర్ 1న థియేటర్స్ లోకి రానుంది.

- Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics