#PVT04 Announcement Motion Poster Released

Wednesday,June 22,2022 - 01:09 by Z_CLU

'ఉప్పెన' తో బ్లాక్ బస్టర్ ఎంట్రీ ఇచ్చిన మెగా హీరో వైష్ణవ్ తేజ్ చకచకా సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం గిరీశాయ దర్శకత్వంలో 'రంగ రంగ వైభవంగా' అనే సినిమా చేస్తున్న వైష్ణవ్ తేజ్ నెక్స్ట్ శ్రీకాంత్ రెడ్డి అనే డెబ్యూ డైరెక్టర్ తో ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ , ఫర్చూర్ 4 సినిమాస్ బేనర్స్ పై తెరకెక్కనున్న ఈ సినిమా త్వరలోనే షూటింగ్ మొదలు కానుంది. ఈ సందర్భంగా సినిమాను ఎనౌన్స్ చేస్తూ రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్ ప్రేక్షకులను ఎట్రాక్ట్ చేస్తూ మంచి బజ్ క్రియేట్ చేస్తోంది.

మోషన్ పోస్టర్ లో "ఈడ ఉండేడిది రాముడు కాదప్ప ఆ రావణుడే కొలిసే రుద్ర కాళేశ్వరుడు !" అంటూ వైష్ణవ్ తేజ్ చెప్పే పవర్ ఫుల్ డైలాగ్ ఆకట్టుకుంది. ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ కంప్లీట్ మాస్ రోల్ లో కనిపించబోతున్నాడు. ఈ విషయాన్ని మేకర్స్ ఫస్ట్ లుక్ రివీల్ చేసి చెప్పారు. సూర్య నాగ వంశీ , సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ సరసన శ్రీలీల హీరోయిన్ గా నటించనుంది. వచ్చే సంక్రాంతికి సినిమాను థియేటర్స్ లో రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఫర్ ది ఫస్ట్ టైం ఫుల్లెంత్ మాస్ సినిమా చేస్తున్న మెగా కుర్ర హీరో వైష్ణవ్ ఈ సినిమాతో సంక్రాంతి బరిలో నిలిచాడు. ఈ సినిమాకు వర్క్ చేయబోయే మిగతా టెక్నీషియన్స్ వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

 
  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics