Pushpa team very buzy with post production work !

Saturday,November 20,2021 - 11:11 by Z_CLU

'పుష్ప' అనుకున్న టైంకి రిలీజ్ అవుతుందా  ? ఈ ప్రశ్నకి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ , సాంగ్స్ తో జవాబు ఇస్తూనే ఉన్నారు మేకర్స్. సరిగ్గా నెల రోజులే ఉంది 'పుష్ప ది రైజ్' రిలీజ్ కి. మేకర్స్ ముందే చెప్పినట్టు  డిసెంబర్ 17నే సినిమాను థియేటర్స్ లోకి తీసుకొచ్చేస్తున్నారు. దీని కోసం రాత్రింబవళ్ళు టీం హార్డ్ వర్క్ చేస్తున్నారు. కేవలం రెండు మూడు గంటలు మాత్రమే పడుకుంటూ పోస్ట్ ప్రొడక్షన్ పనులు చూసుకుంటున్నాడట సుకుమార్. ఇక బన్నీ టీం కూడా ప్రమోషన్ ప్లాన్స్ తో ఫుల్ బిజీగా ఉంది. ఐదు భాషల్లో ఒకేసారి పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అవుతుండటంతో బిజినెస్ పనులతో నిర్మాతలు కూడా ఫుల్ బిజీ. ఇలా ఎవరికి వారు తమ పనులతో తీరిక లేకుండా వర్క్ చేస్తున్నారు.

'పుష్ప ది రైజ్' కి సంబంధించి స్పెషల్ సాంగ్ మినహా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం ప్యాచ్ వర్క్ జరుగుతుంది. అల్లు అర్జున్ -సమంత కాంబినేషన్ లో కొంత మంది డాన్సర్లతో స్పెషల్ సాంగ్ షూట్ చేయాల్సి ఉంది.  స్పెషల్ సాంగ్ కోసం రామోజీ ఫిలింసిటీలో స్పెషల్ సెట్ వేస్తున్నారు. ఈ నెల 28 నుండి ఐదు రోజుల పాటు ఆ సెట్ లో సాంగ్ షూట్ జరగనుంది. మరో రెండు రోజుల్లో బన్నీ డబ్బింగ్ చెప్పబోతున్నాడు. దేవి కూడా షూటింగ్ చేసిన పోర్షన్ కి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చే పనిలో ఉన్నాడు. ఏదేమైనా చెప్పిన డేట్ అందుకోవడానికి పుష్ప టీం మాత్రం గట్టిగా పనిచేస్తూ వీలైనంత త్వరగా ఫస్ట్ కాపీ రెడీ చేయాలని చూస్తోంది.

మైత్రి మూవీ మేకర్స్ బేనర్ పై నవీన్ యర్నేని , రవి శంకర్ నిర్మిస్తున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ పుష్ప రాజ్ అనే సరికొత్త క్యారెక్టర్ లో కనిపించనున్నాడు. ఇప్పటికే బన్నీ లుక్ డైలాగ్ డెలివరీ సినిమాపై భారీ అంచనాలు నెలకొల్పుతున్నాయి. 'రంగస్థలం' తర్వాత సుకుమార్ , 'అల వైకుంఠ పురములో' తర్వాత అల్లు అర్జున్ నుండి వస్తున్న సినిమా కావడంపై ఈ పాన్ ఇండియా మూవీ మీద ట్రేడ్ వర్గాల్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి.

Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics