Pushpa releases on August 13

Thursday,January 28,2021 - 01:23 by Z_CLU

అల వైకుంఠపురములో లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత బన్నీ చేస్తున్న సినిమా పుష్ప. రంగస్థలంతో మరో ఇండస్ట్రీ హిట్ కొట్టిన సుకుమార్ దీనికి దర్శకుడు. అందుకే పుష్పపై భయంకరంగా అంచనాలున్నాయి. ఈ అంచనాల్ని మరింత పెంచుతూ, తాజాగా రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు.

Allu Arjun Pushpa మూవీని ఆగస్ట్ 13న రిలీజ్ చేయబోతున్నారు. ఈ మేరకు నిర్మాతల నుంచి అఫీషియల్ స్టేట్ మెంట్ తో పాటు బ్రాండ్ న్యూ పోస్టర్ వచ్చేసింది.

allu-arjun-pushpa-releases-august-13-zeecinemalu

ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగుతుంది పుష్ప మూవీ. ఈ సినిమాలో రఫ్ అండ్ టఫ్ పుష్పరాజ్ గా కనిపించబోతున్నాడు బన్నీ. అతడి లవ్ ఇంట్రెస్ట్ గా, చిత్తూరు రూరల్ పిల్లగా రష్మిక కనిపించనుంది.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ మారేడుమిల్లిలో జరుగుతోంది. ఈ షెడ్యూల్ తర్వాత హైదరాబాద్ లోనే మరో షెడ్యూల్ ఉంటుంది. ఆ తర్వాత యూనిట్ కేరళ వెళ్తుంది. ఈ 3 షెడ్యూల్స్ తో సినిమాకు సంబంధించి దాదాపు 90శాతం షూటింగ్ పూర్తవుతుంది. దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.