Pushpa is getting ready for fresh schedule

Monday,September 21,2020 - 12:56 by Z_CLU

లాక్ డౌన్ కారణంగా వాయిదాపడిన Allu Arjun Pushpa షూటింగ్ కి సంబంధించి షెడ్యుల్ ప్లాన్ రెడీ అయింది. నవంబర్ నుండి ఈస్ట్ గోదావరి మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో షూటింగ్ జరగనుంది. దాదాపు నెల రోజుల పాటు అక్కడ కొన్ని కీలక సన్నివేశాలు షూట్ చేయబోతున్నారు. ఆ తర్వాత హైదరాబాద్ లో మరో షెడ్యుల్ ప్లాన్ చేస్తున్నారు.

రంగస్థలం తర్వాత Sukumar డైరెక్షన్ లో Ala Vaikunthapuram తర్వాత బన్నీ నుండి వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొంటున్నాయి. ఇప్పటికే రెండు సినిమాలతో ఎంటర్టైన్ చేసిన Sukku-Bunny ఈసారి ఏ రేంజ్ లో మెప్పిస్తారా అని ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్.

Mythri Movie Makers నిర్మిస్తున్న ఈ సినిమాకు Devi Sri మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. అల్లు అర్జున్ సరసన Rashmika హీరోయిన్ గా నటిస్తుంది.