Puri Jagannath follows slow and study method from now

Wednesday,August 24,2022 - 12:26 by Z_CLU

పూరి జగన్నాథ్ పేరు వినగానే ఎవరికైనా ఆయన స్పీడ్ ఫిలిం మేకింగ్ గుర్తొస్తుంది. నెలల్లో సినిమాలు తీసి హిట్లు కొట్టడం , రికార్డులు తిరగరాయడంలో పూరి దిట్ట. అయితే కొన్నేళ్లుగా పూరి స్పీడ్ మరింత పెరిగింది. దాంతో ఆయన నుండి క్వాలిటీ సినిమాలు రావడం లేదని ప్రేక్షకులు నిరాశ పడుతున్నారు. రామ్ ని కంప్లీట్ మాస్ హీరోగా తీర్చిదిద్ది ఇస్మార్ట్ శంకర్ తీసి  బాక్సాఫీస్ కలెక్షన్స్ తో ఐయాం బ్యాక్ అనిపించుకున్నాడు పూరి.

అయితే ఇప్పటి నుండి తనలో కొత్త పూరి కనిపిస్తాడని అంటున్నాడు. 'లైగర్' కోసం దాదాపు మూడేళ్ళు తీసుకున్నాడు పూరి. మధ్యలో కోవిడ్ లాక్ డౌన్ ఎఫెక్ట్స్ తగిలినా పూరి మేకింగ్ స్టైల్ మారి సినిమా బాగా డిలే అవుతూ వచ్చింది. ఇటివలే తాజాగా ఓ ఇంటర్వ్యూలో 'లైగర్' నుండి డైరెక్టర్ గా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తున్నాని ఇదే తనకి మొదటి సినిమా అని ఇకపై మేకింగ్ కి చాలా టైం తీసుకొని క్వాలిటీ ఫిలిమ్స్ చేస్తానని చెప్పుకున్నాడు పూరి.

అంతే కాదు తాజాగా సుకుమార్ తో కలిసి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా పూరి తన మేకింగ్ స్టైల్ గురించి మాట్లాడాడు. సుక్కు తనని రెండు వారాల్లో రాసే స్క్రిప్ట్ కి ఇంకో వారం కేటాయించి రాయమని, అప్పుడు స్క్రిప్ట్ లో క్వాలిటీ వస్తుందని చెప్పాడని ఇకపై తను అదే చేయబోతున్నట్లు తెలిపాడు పూరి. సో ఇకపై స్క్రిప్టింగ్ కోసం నెలలు , మేకింగ్ కోసం ఏళ్ళు తీసుకుంటూ పూరి స్లో అండ్ స్టడీ మెథడ్ ఫాలో అవుతూ కొత్త దారిలో ప్రయాణించనున్నాడన్నమాట.

అమితాబ్ బచ్చన్ హీరోగా తెరకెక్కిన 'బుడ్డా' సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన పూరి మళ్ళీ ఇన్నేళ్ళ గ్యాప్ తర్వాత 'లైగర్' తో అక్కడ ప్రేక్షకులను కూడా పలకరించనున్నాడు. ఈ సినిమా తర్వాత పూరి నుండి వచ్చే సినిమాలన్నీ తెలుగులో పాటు హిందీలో కూడా బైలింగ్వెల్ గా తెరకెక్కనున్నాయి. పూరి మైండ్ సెట్ చేంజ్ అవ్వడానికి బాలీవుడ్ రీ ఎంట్రీ , కోవిడ్ లాక్ డౌన్.. ఇలా చాలా రీజన్ ఉన్నాయి. అందుకే తనని తాను మార్చుకునే పనిలో పడ్డాడు స్టార్ డైరెక్టర్.

 
  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics