PSPK28 – Pawan Harish Shankar Movie Announcement

Wednesday,September 02,2020 - 04:46 by Z_CLU

మోస్ట్ ఎవెయిటింగ్ గబ్బర్ సింగ్ కాంబినేషన్ రిపీట్ అవుతోంది. 8 ఏళ్ల గ్యాప్ తర్వాత పవన్-హరీష్ కలిసి సినిమా చేయబోతున్నారు. 

#PSPK28 ఎనౌన్స్ మెంట్ వచ్చేసింది. Pawan-HarishShankar కాంబోలో సినిమా ప్రకటన వచ్చింది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమా రాబోతోంది.

ఇండియా గేట్ బ్యాక్ డ్రాప్ లో ఓ స్టయిలిష్ బైక్ పెట్టి.. దానిపై పెద్ద బాలశిక్ష పుస్తకం పెట్టిన స్టిల్ తో #PSPK28 ప్రకటన ఇచ్చారు మేకర్స్.

ఈసారి ఇది కేవలం ఎంటర్ టైన్ మెంట్ మాత్రమే కాదు అనే క్యాప్షన్ కూడా జోడించారంటే, సినిమాలో పవన్ ను నెక్ట్స్ లెవెల్ లో చూపించబోయే క్యారెక్టరైజేషన్ రెడీ అయిందనే చెప్పాలి. సర్దార్ వల్లభాయ్ పటేల్, శుభాష్ చంద్రబోస్ ఫొటోల్ని పోస్టర్ లో పెట్టడం మరింత ఆసక్తి రేకెత్తించింది.

ఈ ప్రాజెక్టుకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించబోతున్నాడు. అయనాంక బోస్ సినిమాటోగ్రాఫర్. ప్రస్తుతానికి ఇవే అప్ డేట్స్. హీరోయిన్ గా పూజా హెగ్డేను తీసుకున్నారనేది టాక్.