Producer Mallidi Satyanarayana son Vasishta succeed as director

Monday,August 08,2022 - 05:33 by Z_CLU

'బింబిసార'తో దర్శకుడిగా పరిచయమై మొదటి సినిమాతోనే డైరెక్టర్ గా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు వశిష్ఠ. నిజానికి వసిష్ఠ కి ఈ ఛాన్స్ ఈజీగా రాలేదు. కొన్నేళ్ళుగా కొన్ని కథలు పట్టుకొని తిరుగుతూ ఫైనల్ గా కళ్యాణ్ రామ్ కి ఈ కథ చెప్పి ఇంప్రెస్ చేసి సినిమాను పట్టాలెక్కించుకున్నాడు. వసిష్ఠ అసలు పేరు మల్లిడి వేణు. ఇండస్ట్రీలో ఎక్కువగా వేణు అనే పిలుస్తుంటారు. తెలుగులో కొన్ని హిట్ సినిమాలు నిర్మించిన ప్రముఖ నిర్మాత మల్లిడి సత్యనారాయణ కొడుకే వసిష్ఠ. ఆయన అల్లు అర్జున్ 'బన్నీ' విష్ణు మంచుతో 'డీ' సినిమాలు తీశారు. ఆ తర్వాత తన కొడుకు వసిష్ఠను హీరోగా పరిచయం చేస్తూ 'ప్రేమలేఖ రాశా' అనే సినిమా నిర్మించారు. ఆ సినిమాకు పాటల రచయిత కులశేఖర్ దర్శకుడు. సినిమాను థియేటర్స్ లో రిలీజ్ చేయలేకపోయారు. ఆ తర్వాత ఆయన ఇండస్ట్రీలో కనుమరుగయ్యారు.

ఇక హీరోగా పరిచయమయ్యాక అదే రూట్లో కొనసాగకుండా మెలగా దర్శకత్వం వైపు ఆసక్తి పెంచుకొని ఇండస్ట్రీలో పరిచయాలు చేసుకుంటూ ముందడుగు వేశాడు వసిష్ఠ. ఇక అనుకున్న వెంటనే డైరెక్టర్ అయిపోలేరు కదా  సినిమా కష్టాలన్నీ అనుభవిస్తూ వచ్చాడు వసిష్ఠ. చాలా మంది హీరోలకు కథలు చెప్తూ ముందుకు సాగాడు. ఒక టైంలో అల్లు శిరీష్ తో సినిమా కన్ఫర్మ్ అయింది. కానీ ఎందుకో ప్రాజెక్ట్  డ్రాప్ అయింది. ఫైనల్ గా కళ్యాణ్ రామ్ కి బింబిసార కథ చెప్పడం ఫాంటసీ లైన్ తో ఉన్న స్టోరీ విని కళ్యాణ్ రామ్ స్పెల్ బౌండ్ అవ్వడం వెంటనే సినిమా సెట్స్ పైకి వెళ్ళడం మాత్రం టకటకా జరిగిపోయాయి. ఏదేమైనా ఎలాంటి అనుభవం లేకపోయినా వసిష్ఠ ను కళ్యాణ్ రామ్ నమ్మి ఇంత బడ్జెట్ పెట్టి ఫాంటసీ సినిమా నిర్మించడం గొప్ప విషయమే. అందుకే తనపై నమ్మకం పెట్టుకున్న హీరోకి సాలిడ్ హిట్ ఇచ్చాడు వశిష్ఠ. ఈ సినిమాకు వసిష్ఠ ఎంచుకున్న పాయింట్ అలాగే స్క్రీన్ ప్లే అతనికి రచయితగా కూడా మంచి పేరు తీసుకొచ్చాయి. ముఖ్యంగా దర్శకుడిగా సినిమాను డీల్ చేసిన విధానం అందరినీ ఆకట్టుకుంది.

తండ్రిలా నిర్మాణంలో కొనసాగలేదు వసిష్ఠ . హీరోగా ఒకే ఒక్క సినిమాతో సరిపెట్టుకున్నాడు. డైరెక్షన్ మీదే ఫోకస్ పెట్టాడు. రాత్రి పగలు కష్టపడ్డాడు ఫైనల్ గా మొదటి సినిమాతోనే ప్రేక్షకులను మెప్పించి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాను కళ్యాణ్ రామ్ కు అందించాడు.

   
  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics