Producer DilRaju speech at ‘Vakeel saab’ Prerelease event

Monday,April 05,2021 - 05:16 by Z_CLU

పవర్ స్టార్ తో సినిమా నిర్మించాలనే కోరిక ఎట్టకేలకు 'వకీల్ సాబ్' తో నెరవేరిందని నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తెలిపారు నిర్మాత దిల్ రాజు. పవన్ తో సినిమా చేయాలనుందని చెప్పగానే త్రివిక్రమ్ మీటింగ్ ఏర్పాటు చేసి ఈ ప్రాజెక్ట్ ని ముందుకు తీసుకెళ్లాడని అన్నారు. ఈ సందర్భంగా తన కోరిక నెరవేరేలా సహకరించిన త్రివిక్రమ్ గారికి, అలాగే పింక్ సినిమాను రీమేక్ చేసే అవకాశం కల్పించి ఈ సినిమాను ప్రెజెంట్  చేస్తున్న  బోనీ కపూర్ గార్కి నా స్పెషల్ థాంక్స్ అంటూ తెలిపారు దిల్ రాజు.  ఈవెంట్ లో పవన్ గురించి మాట్లాడిన దిల్ రాజు స్పీచ్ అందరినీ ఆకట్టుకుంది.