Producer DilRaju gives a clarity on AlluArjun’s ICON !

Thursday,April 08,2021 - 02:14 by Z_CLU

కొన్ని సినిమాలు ఎనౌన్స్ మెంట్ వరకూ వచ్చి ఆగిపోతాయి... ఇంకొన్ని షూటింగ్ వరకూ వెళ్లి క్యాన్సెల్ అవుతాయి. తాజాగా అల్లు అర్జున్ తో దిల్ రాజు ఎనౌన్స్ చేసిన ఓ క్రేజీ ప్రాజెక్ట్ కూడా ఈ లిస్టులో చేరిందంటూ ప్రచారం జరిగింది. అదే అల్లు అర్జున్ 'ఐకాన్'. 'వకీల్ సాబ్' తీసిన శ్రీరామ్ వేణు ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నాడు. దిల్ రాజు బేనర్ లో తెరకెక్కనున్న ఈ సినిమా ఎనౌన్స్ మెంట్ తర్వాత మళ్ళీ ఎలాంటి అప్డేట్ లేదు.  బన్నీ కూడా ఈ సినిమాను పక్కన పెట్టి మిగతా సినిమాలు ఎనౌన్స్ చేస్తూ వెళ్తున్నాడు. దీంతో ICON సినిమా ఆగిపోయిందనే ప్రచారం జోరుగా సాగింది.

తాజాగా ఆ ప్రాజెక్ట్ గురించి నిర్మాత దిల్ రాజు క్లారిటీ ఇచ్చాడు. సినిమా ఆగిపోలేదని త్వరలోనే బన్నీ తో వేణు డైరెక్షన్ లోనే ఆ సినిమా ఉంటుందని కానీ అదెప్పుడు స్టార్ట్ అవుతుందనే అప్డేట్ మాత్రం ఈసారి హీరో బన్నీ నుండే వస్తుందని చెప్పాడు. అల్లు అర్జునే ఈ ప్రాజెక్ట్ గురించి చెప్తాడని తెలియజేశాడు. దీంతో  'ఐకాన్' సినిమా మళ్ళీ వార్తల్లో నిలిచింది. కొరటాల సినిమాతో పాటే బన్నీ ఈ సినిమాను కూడా సెట్స్ పైకి తీసుకొస్తాడనే టాక్ బలంగా వినిపిస్తుంది.  మరి ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందో అనేది తెలియాలంటే మాత్రం అల్లు అర్జున్ ఎనౌన్స్ చేసే వరకూ వెయిట్ చేయాల్సిందే.

 

Also Read  Mahesh-Trivikram: 11 ఏళ్ల తర్వాత!

  Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics