Producer Danayya responds on RRR Movie Shooting Updates

Thursday,June 17,2021 - 01:35 by Z_CLU

రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్న RRR Movie కోసం అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే చాలా ఆలస్యమైన ఈ ప్రాజెక్టు త్వరలోనే ఓ కొలిక్కి రాబోతోంది. ఈ మూవీ షూటింగ్ కు సంబంధించిన అప్ డేట్స్ ను స్వయంగా నిర్మాత డీవీవీ దానయ్య బయటపెట్టారు.

RRR సినిమాకు సంబంధించి 2 పాటల చిత్రీకరణ మాత్రమే పెండింగ్ ఉందని ప్రకటించాడు దానయ్య. అందులో ఒకరి తారక్ - చరణ్ లపై షూట్ చేయాల్సిన ఫ్రెండ్ షిప్ సాంగ్.. మరొకటి చరణ్ - ఆలియా భట్ లపై చిత్రీకరించాల్సి రొమాంటిక్ సాంగ్. జూన్ చివరి వారంలో ఈ షెడ్యూల్ ప్రారంభించి, వీలైనంత తొందరగా పెండింగ్ వర్క్ పూర్తిచేస్తామని ప్రకటించారు దానయ్య.

Ramcharan Birthday at RRR set 4

మరోవైపు ఆర్ఆర్ఆర్ విడుదల తేదీపై మరోసారి రూమర్లు మొదలయ్యాయి. గతంలో యూనిట్ ప్రకటించినట్టుగా అక్టోబర్ లో ఈ సినిమా రిలీజ్ అవ్వడం దాదాపు అసాధ్యమనే విషయం తేలిపోయింది. అలా అని కనీసం వచ్చే ఏడాది సంక్రాంతికి కూడా వచ్చే ఛాన్స్ లేదంటున్నారు కొంతమంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే వచ్చే ఏడాది సమ్మర్ కు ఆర్ఆర్ఆర్ థియేటర్లలోకి వస్తుందని చెబుతున్నారు.

ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న 'RRR' మూవీకి సంబంధించిన 10 భాషల బిజినెస్ ఆల్రెడీ జరిగిపోయింది. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన చిత్రంగా ఆర్ఆర్ఆర్ నిలిచింది. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. దాదాపు 450 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అజయ్ దేవరగన్, శ్రియ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, కొమరం భీమ్ గా ఎన్టీఆర్ కనిపించబోతున్నారు. సీత పాత్రలో అలియాభట్ కనిపించనుంది.

  • - Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics