Prashanth Neel to Direct Prabhas after NTR

Saturday,November 28,2020 - 04:55 by Z_CLU

కొన్ని కాంబినేషన్ సినిమలు ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొల్పుతూ ఎట్రాక్ట్ చేస్తుంటాయి. ప్రస్తుతం Prabhas-Prashanth Neel కాంబో ప్రచారం ఆడియన్స్ లో అలాంటి ఆసక్తినే పెంచుతుంది. KGF రిలీజై గ్రాండ్ హిట్ అవ్వగానే ఈ ఇద్దరి కాంబో సినిమా ప్రచారంలోకి వచ్చింది. అప్పటి నుండి ఈ కాంబినేషన్ సినిమాపై రోజుకో వార్త చక్కర్లు కొడుతుంది. ప్రభాస్ నెక్స్ట్ సినిమాల లిస్టు చూస్తే ఈ కాంబో ఇప్పుడే సెట్ అయ్యేలా కనిపించడం లేదనే వాదన కూడా ఉంది.

కానీ లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ప్రభాస్-ప్రశాంత్ కాంబో ఫిక్స్ అయిందట. తాజాగా ఇద్దరూ ఓ కథ కోసం డిస్కషన్ చేసుకున్నారట.

ప్రస్తుతం ప్రభాస్ చేతిలో మూడు సినిమాలున్నాయి.నాగ్ అశ్విన్ సినిమాతో పాటు ఓం రౌత్ దర్శకత్వంలో చేయబోయే 'Adipurush' రెండూ ప్రీ ప్రొడక్షన్ స్టేజిలో ఉన్నాయి. Radheshyam పూర్తవ్వగానే ఆదిపురుష్ సెట్స్ పైకి వెళ్తుంది.

రెబెల్ స్టార్ ఈ రెండు సినిమాలు పూర్తి చేసే లోపు ఎన్టీఆర్ తో ఒక సినిమా చేస్తాడు ప్రశాంత్. అంటే NTR తర్వాత ప్రశాంత్ సినిమా ప్రభాస్ తోనే ఉంటుందనుకోవాలి. త్వరలోనే ఈ క్రేజీ కాంబో సినిమా గురించి ప్రకటన వచ్చే అవకాశం కనిపిస్తుంది.

Also Check - ప్రభాస్ కెరీర్ పై స్పెషల్ స్టోరీ