Prabhas’s Radheshyam Nagumomu Song is instant Hit

Thursday,December 02,2021 - 04:29 by Z_CLU

ప్రభాస్-పూజాహెగ్డే.. రాధేశ్యామ్ సినిమాలో హీరోహీరోయిన్లుగా నటిస్తున్న వీళ్లిద్దరికీ సంబంధించి పోస్టర్లు చూడ్డమే తప్ప, విజువల్ లేదు. మరీ ముఖ్యంగా వీళ్లిద్దరి మధ్య కెమిస్ట్రీ ఎలివేట్ అయ్యే సీన్ ఒక్కటి కూడా లేదు. ఆమధ్య ఓ సాంగ్ రిలీజ్ చేసినప్పటికీ, దాన్ని పూర్తిగా గ్రాఫిక్స్ తో నింపేశారు. ఎట్టకేలకు ఈ వెయిటింగ్ తప్పింది. రాధేశ్యామ్ నుంచి బ్రాండ్ న్యూ సాంగ్ వచ్చింది.

నగుమోము తారలే అనే లిరిక్స్ తో సాగే కొత్త డ్యూయట్ ను విడుదల చేసింది రాధేశ్యామ్ యూనిట్. అంతా అనుకుంటున్నట్టు ఇది లిరికల్ వీడియో కాదు. డైరక్ట్ గా సినిమా వీడియో సాంగ్ ను రిలీజ్ చేసి ఫ్యాన్స్ కు పండగ తీసుకొచ్చారు. ఈ పాటలో కచ్చితంగా చెప్పుకోవాల్సిన ఎలిమెంట్స్ కొన్ని ఉన్నాయి.

పాట చూసిన వెంటనే ఫస్ట్ అనిపించే ఫీలింగ్... హీరోహీరోయిన్లు కెమిస్ట్రీ. ఈ సాంగ్ లో ప్రభాస్-పూజాహెగ్డే ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అదిరిపోయింది. ఆ వెంటనే గుర్తొచ్చే ఎలిమెంట్ లొకేషన్స్. యూరోప్ లోని అద్భుతమైన లొకేషన్స్ లో ఈ పాటను పిక్చరైజ్ చేశారు. ఇక మూడో ఎలిమెంట్ మ్యూజిక్.

కృష్ణకాంత్ అందించిన సాహిత్యానికి జస్టిిన్ ప్రభాకరన్ కంపోజ్ చేసిన ట్యూన్ పెర్ ఫెక్ట్ గా సింక్ అయింది. ఇక స్టార్ సింగర్ సిద్ శ్రీరామ్, తన గాత్రంతో ఈ పాటకు ప్రాణం పోశాడు.

ఇప్పటికే రాధేశ్యామ్ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పుడు ఏకంగా సినిమాలోని ఓ వీడియో సాంగ్ ను రిలీజ్ కు ముందే విడుదల చేసి, ఆ ఎక్స్ పెక్టేషన్స్ ను డబుల్ చేశారు మేకర్స్. సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లలోకి రాబోతోంది రాధేశ్యామ్.