#Prabhas25 – Prabhas with Sandeep Reddy Vanga

Wednesday,October 06,2021 - 05:53 by Z_CLU

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్స్ తో బిజీ గా ఉన్న సంగతి తెలిసిందే. ఒకేసారి మూడు సినిమాలతో షెడ్యుల్ ప్యాక్ చేసుకున్న ప్రభాస్ మరో రెండు భారీ ప్రాజెక్ట్స్ కూడా ఫైనల్ చేసేసుకున్నాడు. అవును #Prabhas25 సినిమా ఎనౌన్స్ మెంట్ త్వరలోనే రాబోతుంది. ఇప్పటికే మేకర్స్ నుండి హింట్ కూడా వదిలారు. ఆ సినిమాను అర్జున్ రెడ్డి ఫేం సందీప్ రెడ్డి వంగాతో ఉంటుందని ప్రచారం జరుగుతుంది.

sandeep-reddy-vanga-zee-cinemalu

'అర్జున్ రెడ్డి' తర్వాత సందీప్ చాలా గ్యాప్ తీసుకున్నాడు. మధ్యలో హిందీలో అర్జున్ రెడ్డి రీమేక్ ఒకటి మాత్రమే చేసుకొచ్చాడు. కానీ స్టార్ హీరోల్లో కొందరికి కథలు వినిపించాడు. 'అర్జున్ రెడ్డి' సెన్సేషనల్ హిట్టయిన తర్వాత మహేష్ , చరణ్ లు సందీప్ తో సినిమా చేయాలనుకున్నారు. కానీ ఎందుకో కుదరలేదు. ఇక రీసెంట్ గా ప్రభాస్ ను కలిసి ఓ స్క్రిప్ట్ వినిపించి గ్రీన్ సిగ్నల్ అందుకున్నాడట సందీప్. త్వరలోనే ఈ కాంబో సినిమా గురించి ఎనౌన్స్ మెంట్ రాబోతుంది.

రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'రాథేశ్యామ్' సినిమా ప్రభాస్ కి 20వ సినిమా. ఈ లెక్కన చూసుకుంటే 'సలార్' 21 కాగా 'ఆదిపురుష్' 22, నాగ్ అశ్విన్ సినిమా 23 అవుతుంది. ఇక 24 వ సినిమాను బాలీవుడ్ లో ఓ డైరెక్టర్ తో ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇప్పటికే ఆ సినిమాకు సంబంధించి డిస్కషన్స్ మొదలయ్యాయి. త్వరలోనే ఆ సినిమా అప్ డేట్ కూడా రానుంది. ఆ సినిమాతో పాటే సందీప్ రెడ్డి వంగా సినిమాను కూడా సెట్స్ పైకి తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నాడు రెబెల్ స్టార్. ఇక ఈ సినిమాను నిర్మించనున్న నిర్మాత ఎవరనేది తెలియాల్సి ఉంది. మరి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ తో ఎనౌన్స్ మెంట్ వస్తుందా ? లేదా కేవలం కాంబో మాత్రమే ప్రకటిస్తారా ? చూడాలి. ప్రస్తుతం ప్రభాస్ కమిట్ అయిన మూడు సినిమాలు జెట్ స్పీడులో ఫినిష్ చేసే ప్లానింగ్ లో ఉన్నాడు.

  • - Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics