Prabhas to start 2 movies at a time

Saturday,January 23,2021 - 09:38 by Z_CLU

ఓం రౌత్ డైరెక్షన్ లో ప్రభాస్ నటిస్తున్న 'Adipurush' సినిమాను ఇటివలే ఎనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి మోషన్ క్యాప్చర్ వర్క్ మొదలైంది. మరో వైపు ప్రశాంత్ నీల్ తో ప్రభాస్ నటిస్తున్న 'Salaar' కూడా ఇటివలే గ్రాండ్ గా ప్రారంభమై ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. ఈ రెండు సినిమాలను అటు ఇటు గా ఒకేసారి సెట్స్ పై పెట్టి జెట్ స్పీడులో ఫినిష్ చేయాలని చూస్తున్నాడు ప్రభాస్.

సలార్ షూటింగ్ ను ఈ నెలలోనే మొదలు పెట్టి వచ్చే నెలలో ఆదిపురుష్ సినిమాను సెట్స్ పైకి తీసుకురావాలని చూస్తున్నాడు ప్రభాస్. ఇప్పటికే ఈ భారీ బడ్జెట్ సినిమాలకు సంబంధించి మొదటి షెడ్యుల్ ప్లానింగ్ జరుగుతుంది. వీటి కోసం ప్రత్యేకమైన టీం వర్క్ చేస్తుంది.

త్వరలోనే 'రాధే శ్యామ్' తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ప్రభాస్ ఈ రెండు సినిమాలను త్వరగా ఫినిష్ చేసి నాగ్ అశ్విన్ సినిమాను మొదలు పెట్టనున్నాడు. మరి ఈ భారీ ప్రాజెక్ట్స్ తో పాన్ ఇండియా లెవెల్ లో ప్రభాస్ ఎంతటి ఘన విజయాలు అందుకుంటాడో చూడాలి.