Prabhas Speech at Radheshyam Pre Release Function

Friday,December 24,2021 - 01:16 by Z_CLU

ప్రభాస్ హీరోగా నటించిన సినిమా రాధేశ్యామ్. నిన్న జరిగిన ప్రీ-రిలీజ్ ఫంక్షన్ లో ఈ సినిమా ట్రయిలర్ ను లాంఛ్ చేశారు. ట్రయిలర్ తో సినిమాపై అంచనాలు డబుల్ అయ్యాయి. ఫ్యాన్స్ అయితే పండగ చేసుకుంటున్నారు. ఈ క్రేజ్ ను మరింత పీక్ స్టేజ్ కు తీసుకెళ్లాడు హీరో ప్రభాస్.

రాధేశ్యామ్ సినిమాలో క్లైమాక్స్ అదిరిపోతుందంటున్నాడు ప్రభాస్. సినిమా లవ్ స్టోరీనే అయినప్పటికీ చాలా ట్విస్టులు, టర్న్ లు ఉంటాయంటున్నాడు.

"గోపికృష్ణ మూవీస్ అంటే పెద్ద సినిమాలకు పెట్టింది పేరు తాండ్ర పాపారాయుడు, బొబ్బిలి బ్రహ్మన్న, మన ఊరి పాండవులు లాంటి సినిమాలు వచ్చాయి. అందుకే కాస్త టెన్షన్ ఉంటుంది. ఈ బ్యానర్లో ముందు బిల్లా సినిమా చేశాము. బాగానే ఆడింది. ఇప్పుడు రాధే శ్యామ్ వస్తుంది. క్యూట్ లవ్ స్టోరీ అయినా కూడా ట్రైలర్లో చూశారు కదా.. సర్ ప్రైజింగ్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. కరోనా సమయంలో కూడా ఈ సినిమా కోసం చాలా మంది కష్టపడ్డారు. ముఖ్యంగా నిర్మాతలు ఖర్చుకు వెనకాడలేదు. హిందీ, తెలుగు సంగీత దర్శకులు అద్భుతమైన పాటలు ఇచ్చారు. రాధాకృష్ణ కుమార్ మంచి విజన్ ఉన్న డైరెక్టర్. బాహుబలి అయిపోయిన తర్వాత సాహో టైంలో మొదలుపెట్టి ఆపేసి.. మళ్లీ కరోనా వచ్చిందని కొన్ని రోజులు ఆపి.. ఇలా పని చేయాలి అంటే ఫ్రస్టేషన్ ఉంటుంది. కానీ డైరెక్టర్ మాత్రం అద్భుతమైన అవుట్పుట్ ఇచ్చాడు. మీకు ట్రైలర్ లోనే అది కనిపిస్తుంది. సినిమాలో చాలా ట్విస్టులు ఉంటాయి. మరీ ముఖ్యంగా క్లైమాక్స్ హైలెట్ గా ఉంటుంది."