Prabhas Salaar casting call process completed

Friday,December 18,2020 - 04:44 by Z_CLU

ప్రభాస్ (Prabhas) హీరోగా రాబోతున్న పాన్ ఇండియా మూవీ సలార్ (Salaar)కు సంబంధించి కాస్టింగ్ కాల్ పూర్తయింది. దాదాపు వంద మందిని ఆడిషన్స్ ద్వారా సెలక్ట్ చేసినట్టు తెలుస్తోంది.

ఇలా సెలక్ట్ చేసిన వాళ్లందరికీ సినిమాలో కాలేజ్ స్టూడెంట్ రోల్స్, మాఫియా గ్యాంగ్ లో మెంబర్స్ రోల్స్ ఇవ్వబోతున్నారట. వీటితో పాటు కొన్ని ఫైట్ సీక్వెన్స్ ల్లో కూడా వీళ్లను ఉపయోగించుకోబోతున్నారు.

మరో వారం రోజుల్లో రాధేశ్యామ్ షూటింగ్ ను పూర్తిచేయబోతున్నాడు ప్రభాస్. సంక్రాంతి తర్వాత సలార్ మూవీని సెట్స్ పైకి తీసుకొచ్చే ప్లాన్ లో ఉన్నాడు. అయితే ఇది కేజీఎఫ్2 అప్ డేట్ పై ఆధారపడి ఉంటుంది.

ప్రశాంత్ నీల్ తన పనులన్నీ పూర్తిచేయగలిగితే జనవరి నుంచి సలార్ సెట్స్ పైకి వస్తుంది. లేదంటే ఇంకాస్త ఆలస్యమౌతుంది. మరోవైపు ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే విషయాన్ని ఫైనల్ చేసే పనిలో ఉన్నారు మేకర్స్.

Also Check - దూసుకుపోతున్న ప్రభాస్