Prabhas Maruthi Combination on cards

Saturday,January 22,2022 - 05:44 by Z_CLU

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , మారుతి కాంబినేషన్ లో సినిమా అంటూ ఓ న్యూస్ చక్కర్లు కొడుతుంది. అయితే ఇంత వరకూ ఈ కాంబోలో సినిమా వస్తుందని ఎవరూ ఊహించకపోవడంతో ప్రస్తుతం ఈ కాంబినేషన్ సినిమా న్యూస్ వైరల్ అవుతుంది. ఇంతకీ ఈ కాంబినేషన్ లో సినిమా నిజమేనా ? అనే డౌట్ చాలా మందిలో ఉంది. దానికి కారణం ప్రభాస్ చేతిలో ఇప్పటికే అరడజను సినిమాలున్నాయి. మొన్నీ మధ్యే సందీప్ రెడ్డి వంగాతో 'స్పిరిట్' అనే టైటిల్ తో సినిమా ఎనౌన్స్ అయింది. మరి ఇవన్నీ ఉండగా ప్రభాస్ ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు చేస్తాడనే డౌట్ అందరిలో ఉంది. పైగా ఈ సినిమా సమ్మర్ నుండి స్టార్ట్ అంటూ టాక్ వినబడుతుంది.

నిజమేంటంటే ? ఈ కాంబినేషన్ లో సినిమా మాత్రం పక్కా... కానీ ఇప్పుడే రాకపోవచ్చు. ప్రస్తుతం ప్రభాస్ కమిట్ అయిన ప్రాజెక్ట్స్ ఫినిష్ చేయాల్సి ఉంది. ఈ లోపు మారుతి పూర్తి స్క్రిప్ట్ రెడీ చేయాలి. కొంత వరకూ స్క్రిప్ట్ వర్క్ జరిగింది. ఇంకా కొంత బ్యాలెన్స్ ఉందని తెలుస్తుంది. ఈ కాంబో సినిమాను DVV ఎంటర్టైన్ మెంట్స్ బేనర్ పై దానయ్య నిర్మించనున్నాడు. త్వరలోనే మిగతా డీటెయిల్స్ బయటికి రానున్నాయి.

సినిమాకు సూపర్ డీలక్స్ అనే టైటిల్ అనుకుంటున్నారని , ఇది హారర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్క నున్న సినిమా అని టాక్. మారుతి హారర్ లో మంచి పట్టు ఉంది. కెరీర్ ఆరంభంలో ఈ జోనర్ లో సూపర్ హిట్ కొట్టాడు. హారర్ కి కామెడీ మిక్స్ చేయడంలో మారుతీ దిట్ట. అందుకే ప్రభాస్ మారుతి చెప్పిన కథకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉండొచ్చు. ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని డీటెయిల్స్ తెలియాల్సి ఉంది.