Prabhas Looks Stylish in Radhe Shyam Poster

Wednesday,October 21,2020 - 01:37 by Z_CLU

'Radheshyam' నుండి Prabhas స్టైలిష్ లుక్ ను విడుదల చేసారు మేకర్స్. ఇప్పటికే ఫస్ట్ లుక్ అందరినీ ఎట్రాక్ట్ చేసి అంచనాలు పెంచగా తాజాగా రిలీజ్ చేసిన ప్రభాస్ సోలో పోస్టర్ ఆ అంచనాలను రెట్టింపు చేసింది. సినిమాలో ప్రభాస్ 'Vikram Aditya'గా కనిపిస్తాడని పోస్టర్ ద్వారా క్లారిటీ ఇస్తూ క్యారెక్టర్ ఎంత స్టయిలిష్ గా ఉంటుందో తెలియజేసారు.

ప్రస్తుతం రాధే శ్యామ్ నుండి రిలీజైన ఈ పోస్టర్ సోషల్ మీడియాలో హంగామా చేస్తుంది. ఇక ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుండి మోషన్ పోస్టర్ రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్.

Prabhas Look Radhe Shyam movie

GopiKrishna Movies సమర్పణలో UV Creations, T Series నిర్మిస్తున్న ఈ సినిమాకు Radha Krishna దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఇటలీలో సినిమా షూటింగ్ జరుగుతుంది. ఈ సినిమాకు Justin Prabhakaran మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.

మరోవైపు సినిమా రిలీజ్ డేట్ ను కూడా మోషన్ పోస్టర్ తో పాటు ఎనౌన్స్ చేసే అవకాశం ఉంది. లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం.. వచ్చే ఏడాది సమ్మర్ ఎట్రాక్షన్ గా ఏప్రిల్ 28న ఈ సినిమాను రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. అదే తేదీకి గతంలో ప్రభాస్ నటించిన బాహుబలి-2 రిలీజైంది.