Prabhas in Sudha Kongara Direction?

Monday,May 10,2021 - 01:53 by Z_CLU

ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్స్ తో బిజీ గా ఉన్నాడు ప్రభాస్. మూడు భారీ సినిమాలకు సైన్ చేసి వాటిలో రెండు సినిమాలను సెట్స్ పై పెట్టేసి వర్క్ చేస్తున్నాడు. తాజాగా ప్రభాస్ నెక్స్ట్ లిస్టులో మరో డైరెక్టర్ పేరు వినబడుతుంది. అవును.. ఇటివలే 'ఆకాశమే నీ హద్దురా' సినిమాతో సూర్యను డైరెక్ట్ చేసిన లేడీ డైరెక్టర్ సుధా కొంగర ప్రభాస్ ని డైరెక్ట్ చేసేందుకు సిద్దమవుతుందని తెలుస్తుంది.

రీసెంట్ గా ప్రభాస్ ను కలిసి ఓ స్క్రిప్ట్ నెరేషన్ ఇచ్చిందట సుధా. కథ నచ్చడంతో ప్రభాస్ ఈమెకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు. సుధా మన తెలుగమ్మాయే. మొదట తెలుగులో ఒక సినిమా చేసి ఆ తర్వాత కోలీవుడ్ కెళ్ళి అక్కడ డైరెక్టర్ గా బిజీ అయ్యింది. మొన్నీ మధ్యే తెలుగులో వెంకటేష్ తో 'గురు' అనే స్పోర్ట్స్ సినిమా చేసింది.

[caption id="attachment_189161" align="alignnone" width="426"]Sudha-Kongara-prabhas-movie-zeecinemalu దర్శకురాలు సుధా కొంగర[/caption]

అయితే ప్రభాస్ ఓకె అన్నప్పటికీ కానీ ఈ కాంబో సినిమా సెట్స్ పైకి వెళ్ళడానికి చాలా టైం పడుతుంది. ప్రస్తుతం షూటింగ్ చేస్తున్న 'ఆదిపురుష్', 'సలార్' కాకుండా నాగ్ అశ్విన్ సినిమా కూడా ఉంది. ఆ సినిమా ఈ ఏడాది చివర్లో సెట్స్ పైకి వెళ్ళబోతుంది. ఆ సినిమా కంప్లీట్ అయ్యాకే సుధాకి ప్రభాస్ ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది. ఇక 'ఆకాశమే నీ హద్దు రా' OTT లో విడుదలై మంచి సినిమా అనిపించుకుంది. సినిమా చూసి స్టార్స్ సుధాని సూర్య ని మెచ్చుకున్నారు. అందుకే ఈమె ఎక్కువ గ్యాప్ లేకుండా వెంటనే మరో సినిమా చేయాలని చూస్తోంది.

ప్రభాస్ డేట్స్ దొరికే లోపు మరో సినిమా చేసి రిలీజ్ చేసే ప్లాన్ లో ఉందట సుధా. తమిళ్ లో ఓ చిన్న సినిమా చేసే ఆలోచనలో ఉందని తెలుస్తుంది. ఇక ప్రభాస్ తో పాటు మహేష్ బాబు కి కూడా సుధా ఓ స్క్రిప్ట్ చెప్పిందని, మహేష్ నుండి గ్రీన్ సిగ్నల్ అందుకుందని టాక్. మరి ఆ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో ?

  • - Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics