Prabhas completes 18 years career

Wednesday,November 11,2020 - 12:07 by Z_CLU

రెబల్‌స్టార్‌ ప్రభాస్‌... టాలీవుడ్‌ బాక్సాఫీస్‌ బాహుబలి.. ప్యాన్‌ ఇండియా హీరోగా వరుస సినిమాలను చేస్తూ తెలుగు సినిమా మార్కెట్‌ రేంజ్‌ను ప్యాన్‌ ఇండియా రేంజ్‌కు మారుస్తున్న తిరుగులేని స్టార్‌. హీరోగా ఈశ్వర్‌ సినిమాతో ఆయన కెరీర్‌ స్టార్‌ అయ్యింది.

Prabhas 18 years career 4

మన తెలుగు సినీ ప్రేక్షకాభిమానులు గర్వపడేలా సినిమాలు చేస్తున్న ప్రభాస్‌ హీరోగా పరిచయమై 18 సంవత్సరాలవుతుంది. హీరోగా ఈశ్వర్‌ సినిమాతో ప్రభాస్‌ తన జర్నీని ప్రారంభించాడు. 2002, నవంబర్‌ 11న సినిమా విడుదలైంది.

Prabhas 18 years career 1

18 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రభాస్ తొలి సినిమా ఈశ్వర్ జ్ఞాపకాల్ని గుర్తుచేసుకున్నాడు, ఆ మూవీ డైరక్టర్ జయంత్ సి.పరాన్జీ.

- నిజానికి నేను ప్రభాస్‌ను కలిసేటప్పుడు తను కృష్ణంరాజు గారి ఫ్యామిలీ హీరో అని తెలియదు. నిర్మాత అశోక్‌ ఈ విషయాన్ని నా దగ్గర దాచేశారు. నేను తనను కలిసే సమయంలో చూడగానే, ఇతను స్టార్‌ మెటీరియల్‌ అని అనిపించింది. తొలి మీటింగ్‌ తర్వాత అశోక్‌గారు ప్రభాస్‌ గురించి అసలు విషయాన్ని చెప్పారు. చెప్పగానే నేను షాక్‌ అయ్యాను. తను ఓ స్టార్‌ ఫ్యామిలీ నుండి వచ్చిన హీరోలా ఫీల్‌ కాలేదు. చాలా డౌన్‌ టు ఎర్త్‌ పర్సన్‌.

Prabhas 18 years career

- నిజానికి హీరో ఎవరో తెలియక ముందు ఓ సాఫ్ట్‌ లవ్‌స్టోరి చేద్దామని అనుకున్నాను. కానీ ఎప్పుడైతే, ప్రభాస్‌ను కలిశానో, కథలో చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసుకుంటూ వచ్చాం. హీరో పాత్రను కాస్త మాస్‌ రేంజ్‌లో మార్చాం. మదర్‌ సెంటిమెంట్‌, లవ్‌ట్రాక్‌ ఇవన్నీ కలిసి సినిమా చేశాం.

Prabhas 18 years career 6

- తొలి సినిమాతో హీరోగా ప్రభాస్‌ తనేంటో ప్రూవ్‌ చేసుకున్నారు. ఆ తర్వాత నేను తనతో సినిమా చేయలేకపోయినప్పటికీ, వీలున్న సందర్భాల్లో కలుస్తూనే ఉంటాను. కలిసిన ప్రతిసారి ఆప్యాయంగా పలకరిస్తాడు. ఇంత పెద్ద స్టార్‌ అయిన కూడా తనతో వర్క్‌ చేసిన కోఆర్టిస్టులు, టెక్నీషియన్స్‌తో చాలా ప్రేమగా ఉంటాడు. అప్పుడెలా ఉన్నాడో.. ఇప్పుడలాగే ఉన్నాడు. అందుకే ఆయన డార్లింగ్ అయ్యాడు.