Pooja Hegde in Pawan-Harish Shankar Movie

Monday,August 24,2020 - 03:30 by Z_CLU

ప్రస్తుతం వేణు శ్రీరామ్ తో 'Vakeel Saab' సినిమా చేస్తున్న పవర్ స్టార్ Pawan Kalyan ఈ సినిమాతో పాటే క్రిష్ డైరెక్షన్ లో ఓ పిరియాడిక్ సినిమా చేస్తున్నాడు. వీటి తర్వాత Harish Shankar తో తన 28వ సినిమా చేయబోతున్నాడు పవన్. ఇప్పటికే అనౌన్స్ అయిన ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ఇందులో పవన్ సరసన హీరోయిన్ గా Pooja Hegde ను తీసుకోవాలనుకుంటున్నాడట హరీష్.

హరీష్ శంకర్ తెరకెక్కించిన 'DJ' లో హీరోయిన్ గా నటించింది పూజ. 'గద్దలకొండ గణేష్' లో కూడా మంచి పాత్రలో కనిపించింది. హరీష్, పూజా కాంబోలో ఇప్పటికే రెండు సినిమాలోచ్చాయి. ఒకవేళ పవన్ సినిమాకి కూడా ఈ భామ హీరోయిన్ గా ఫిక్స్ అయితే వీరిద్దరికీ ఇది మూడో సినిమా అవుతుంది.

కరోనా ఎఫెక్ట్ వల్ల పవన్ ,క్రిష్ సినిమా షూట్ ఇప్పుడే స్టార్ట్ అయ్యే అవకాశం కనిపించడం లేదు. ఈ లోపు PowerStar హరీష్ సినిమాను సెట్స్ పైకి తీసుకొచ్చి ఫినిష్ చేస్తాడనే ప్రచారం జరుగుతుంది. ఈ కాంబినేషన్ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యర్నేని, రవిశంకర్ నిర్మించనున్నారు.