Pooja Hegde in Allu Arjun’s PUSHPA item song?

Friday,May 14,2021 - 04:20 by Z_CLU

కొన్ని సినిమాలకు వర్కౌట్ అయిన హీరోయిన్స్ ని మళ్ళీ తమ నెక్స్ట్ సినిమాల్లో పెట్టుకుంటూ సెంటిమెంట్ గా భావిస్తుంటారు దర్శక నిర్మాతలు. తాజాగా సుకుమార్ -బన్నీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పుష్ప సినిమాకి కూడా ఇలాంటి ఓ సెంటిమెంట్ ఉందట. సుకుమార్ , మైత్రి కాంబినేషన్ లో వచ్చిన 'రంగస్థలం' సినిమాలో పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ లో చరణ్ తో కలిసి డాన్స్ వేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు 'పుష్ప' లో కూడా పూజాతో స్పెషల్ సాంగ్ చేయించాలని భావిస్తున్నారు.

[caption id="attachment_168824" align="alignnone" width="575"]allu arjun pooja hegde             అల్లు అర్జున్ - పూజా హెగ్డే[/caption]

సుకుమార్ -దేవి కాంబినేషన్ లో ఇప్పటికే చాలా ఐటెం సాంగ్స్ వచ్చాయి. అన్ని సూపర్ హిట్ సాధించాయి. ఇప్పుడు పుష్ప లో కూడా అలాంటి ఓ ఎనర్జిటిక్ ఐటెం సాంగ్ కంపోజ్ చేసి రికార్డింగ్ చేశాడు దేవి శ్రీ ప్రసాద్. ఆ సాంగ్ కోసం మొన్నటి వరకూ దిశా పటాని తో పాటు మరికొందరు హీరోయిన్స్ ని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఫైనల్ గా తమకి కలిసొచ్చిన పూజతోనే సాంగ్ చేయించాలని డిసైడ్ అయ్యారట మేకర్స్. ప్రస్తుతం పూజ మేనేజర్ తో మేకర్స్ సంప్రదింపులు జరుపుతున్నారట.

pooja Hegde latest stills

ఇక అల్లు అర్జున్ తో ఇటివలే 'అల వైకుంఠ పురములో'సినిమాలో హీరోయిన్ గా నటించింది పూజ. ఈ కాంబోలో ఇప్పటికే రెండు సినిమాలు వచ్చాయి. ఇక అల వైకుంఠపురములో బన్నీ , పూజ కలిసి డాన్స్ చేసిన బుట్ట బొమ్మ రికార్డు స్థాయి వ్యూస్ తో సంచలన విజయం అందుతుంది. సో బన్నీ కి కూడా ఒక రకంగా పూజ సెంటిమెంట్ అని చెప్పొచ్చు. అందుకే ఈ హాట్ బ్యూటీ ని స్పెషల్ సాంగ్ కి ఫైనల్ చేసే పనిలో ఉన్నారని సమాచారం.

  • - Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics