Pooja Hegde in Allu Arjun’s ICON Movie

Monday,September 06,2021 - 07:59 by Z_CLU

ప్రెజెంట్ సుకుమార్ డైరెక్షన్ లో 'పుష్ప' ఫ్రాంచైజీ చేస్తున్న ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ నెక్స్ట్ శ్రీరామ్ వేణు దర్శకత్వంలో 'ఐకాన్' అనే సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజిలో ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాది ఆరంభంలో సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి బన్నీ తనకి లక్కీగా మారిన హీరోయిన్ ని రిపీట్ చేయబోతున్నడని తెలుస్తుంది.

అవును పూజా హెగ్డేని ఈ సినిమాలో హీరోయిన్ గా ఫైనల్ చేసే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. అల్లు అర్జున్ తో పూజ ఇప్పటికే రెండు సినిమాల్లో నటించింది. DJ 'అల వైకుంఠపురం' సినిమాల్లో వీరిద్దరి కెమిస్ట్రీకి మంచి మార్కులు పడ్డాయి. అందుకే ఇప్పుడు మళ్ళీ ఈ కాంబోని రిపీట్ చేయాలని ఫిక్స్ అయ్యారట మేకర్స్. బన్నీ కూడా పూజ పేరునే సజిస్ట్ చేశాడని టాక్.

వకీల్ సాబ్ తో దర్శకుడిగా మంచి గుర్తింపు అందుకున్న శ్రీరామ్ వేణు అల్లు అర్జున్ కోసమే ఐకాన్ స్క్రిప్ట్ రెడీ చేసుకున్నాడు. ఇందులో రోడ్ ట్రిప్ మీద కొన్ని సన్నివేశాలు ఉంటాయని సమాచారం. ప్రస్తుతం దర్శకుడు వేణు స్క్రిప్ట్ కి ఫైనల్ టచ్ ఇచ్చే పనిలో ఉన్నాడు. బన్నీ , సుకుమార్ తో చేస్తున్న 'పుష్ప' షూటింగ్ ఫినిష్ అవ్వగానే ఈ సినిమాను సెట్స్ పై పెట్టేసి ఐకాన్ గా మారనున్నాడు. దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కనున్న ఈ సినిమాపై ప్రీ లుక్ పోస్టర్ రిలీజ్ నుండే భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి బన్నీ -వేణు శ్రీరామ్ -దిల్ రాజు కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి.

  • - Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics