Pooja Hegde finished Radheshyam Schedule

Saturday,October 31,2020 - 05:06 by Z_CLU

అల వైకుంఠపురములో తర్వాత Prabhasతో 'Radheshyam'సినిమా చేస్తున్న Pooja Hegde తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఇటలీ షెడ్యుల్ ఫినిష్ చేసింది. దాదాపు 10 రోజులకు పైగా షూట్ లో పాల్గొన్న పూజ తిరిగి ఇండియా వచ్చేసింది. ప్రభాస్ తో ఫస్ట్ టైం స్క్రీన్ షేర్ చేసుకుంటున్న ఈ బ్యూటీ సినిమాలో ప్రేరణ క్యారెక్టర్ తో మెస్మరైజ్ చేయడం గ్యారెంటీ అనే టాక్ వినబడుతుంది.

ఇక కొన్ని రోజుల బ్రేక్ తర్వాత హైదరాబాద్ లో మరో షెడ్యుల్ ప్లాన్ చేస్తున్నారు యూనిట్. ఈ లోపు కమిట్ అయిన సినిమాలకు డేట్స్ ఇవ్వనుంది Pooja Hegde. వాటి షూట్ ఫినిష్ చేసి మళ్ళీ Radheshyam సెట్ లోకి అడుగు పెట్టనుంది. Gopikrishna Movies సమర్పణలో UV Creations , TSeries నిర్మిస్తున్న ఈ సినిమాకు Justin Prabhakaran మ్యూజిక్ అందిస్తున్నాడు.