Penny Song – becomes instant hit with Record Views !

Monday,March 21,2022 - 05:21 by Z_CLU

'సర్కారు వారి పాట' నుండి రిలీజైన "పెన్ని" సాంగ్ రికార్డు వ్యూస్ కొల్లగొట్టి మోస్ట్ పాపులర్ సాంగ్ అనిపించుకుంటుంది. విడుదలైన కొన్ని గంటల్లోనే 18 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసి 'కళావతి' సాంగ్ రీచ్ ని దాటేసింది. తమన్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ కి అనంత్ శ్రీరామ్ లిరిక్స్ అందించాడు. అలాగే లిరికల్ సాంగ్ లో మహేష్ కూతురు ఘట్టమనేని స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది.

ఇక సాంగ్ లో మహేష్ స్టెప్ తో పాటు సితార వేసిన స్టెప్స్ కూడా సాంగ్ ని విజువల్ గా ఆకట్టుకున్నాయి. సూపర్ స్టార్ స్టైలిష్ లుక్ తో మెస్మరైజ్ చేసి సాంగ్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళాడు. ఇక సింగర్ నకాష్ అజీజ్ కలిసి తమన్ సాంగ్ లో మెరిశాడు. ఓవరాల్ గా సినిమా థీమ్ ని అలాగే మహేష్ క్యారెక్టర్ ని తెలిజేసేలా ఉన్న ఈ సాంగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో హంగామా చేస్తూ విడుదలైన 24 గంటల్లోనే భారీ వ్యూస్ అందుకొని TFI లోనే ఆల్ టైం రికార్డ్ గా నిలిచింది .

మైత్రి మూవీ మేకర్స్ , 14 రీల్స్ ప్లస్ , GMB ఎంటర్టైన్ మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు నవీన్  యర్నేని, రవి శంకర్  , రామ్ ఆచంట , గోపీనాథ్ ఆచంట నిర్మిస్తున్నారు. మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు పరశురాం దర్శకుడు. ప్రెజెంట్ లాస్ట్ షెడ్యుల్ షూట్ జరుపుకుంటున్న ఈ సినిమా మే 12 న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

   
Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics